Saturday 6 February 2021

Vizag Steel Plant:ఈ దేశం గుజరాత్ దేశం కాబోతుంది.. జాతిపిత మోడీ: శివాజీ ఈజ్ బ్యాక్, స్కామ్ ఎన్నికోట్లంటే!

కేంద్రానికి ప్రత్యేక హోదా ఊసేలేదు.. కనీసం కేంద్ర బడ్జెట్‌లో అయినా విశాఖ రైల్వే జోన్, మెట్రో‌ను ఆర్థికంగా ఆదుకుంటారనుకుంటే అక్కడా మొండిచేయి ఎదురైంది. సాయం చేయకపోగా.. విశాఖ ఉక్కును తెగనమ్మాలని నిర్ణయించిన ప్రభుత్వ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్‌లో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. ప్రజలు ఉద్యమ బాట పడుతుంటే.. ప్రైవేటీకరణ ఇష్యూ రాజకీయ పార్టీల్లోనూ కాకరేపుతుంది. కొంతమంది రాజీనామా బాటపట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి రెడీ అవుతుండగా.. ఈ ఉద్యమంలో ప్రముఖ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 2019లోనే ఆపరేషన్ గురుడ అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సంచలన విషయాలను బయటపెట్టిన శివాజీ.. తాజా రాజకీయ పరిణామాలతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై సంచలన కామెంట్స్ చేశారు శివాజీ. భారతదేశాన్ని గుజరాత్ దేశంగా మార్చేయబోతున్నారంటూ ఫైర్ అయ్యారు. శివాజీ మాట్లాడుతూ.. ‘ఎందుకో ఆంధ్ర అనే పేరు గుజరాత్ ప్రధానికి నచ్చడం లేదు.. ఆంధ్రా బ్యాంక్‌ని తీసేశారు.. వేరే బ్యాంక్‌లో కలిపేశారు.. దేశం మొత్తం గుజరాత్ అయిపోతుంది.. భారతదేశం ఏం లేదు.. గుజరాత్ దేశం కాబోతుంది. జాతిపిత నరేంద్ర మోదీ. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర అనే పేరు ఎక్కడా కనిపించకూడదు. ప్రత్యేక హోదా కోల్పోయాం.. అని వాళ్లు అనుకుంటున్నారు.. అది ఎప్పటికీ జరగదు. అది మా హక్కు.. ఆ హక్కుని చెరిపేయలేరు. అలాగే కడప స్టీల్ ఏ దశలో తెలియదు. అమరావతి రైల్వే లైన్‌కి వెయ్యి రూపాయిలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ని ఇంత అవమానకరంగా అన్యాయం చేస్తుంటే భరిస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో మీరు ఏమైపోయారో అని నా గురించి అనుకోవచ్చు. ప్రజలు ఆల్రెడీ ఓ తీర్పు ఇచ్చారు కాబట్టి.. వెయిట్ చేస్తున్నాం. జగన్ ఏం చేస్తాడని వెయిట్ చేస్తున్నా.. చంద్రబాబు హయాంలో కూడా ఇదే చెప్తున్నా. నా వాదన ఇదే. కానీ రాష్ట్రం నుంచి ప్రతిదీ ఇలా తరలిపోతుంటే భావితరాలకు మీరు ఏం ఇవ్వబోతున్నారు. అమ్మఒడి అని ఇస్తున్నారు.. వాటివల్ల నేను మాట్లాడదల్చుకోలేదు. చంద్రబాబు, మీరు పదవులు అనుభవిస్తూ ఊరుకుంటే రాష్ట్ర భవిష్యత్ ఏంటి అని. 2019లో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే ఒక మిత్రుడు నాకు చెప్పాడు. ఏదో జరుగుతుంది.. తేడా కొట్టేట్టు ఉంది అని చెప్పాడు. అప్పుడు నేను దీనిపై ఫోకస్ పెట్టా. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ని ప్రైవేట్ పరం చేయబోతున్నారని తెలిసింది. అప్పుడే నేను స్టేట్ మెంట్ ఇచ్చా. దానిలో భాగంగానే చాలా విషయాలను బయటపెట్టా. సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తాం అని చెప్తే.. తెలంగాణ అగ్నిగుండం అయ్యేది. కానీ ఏపీలో ఏం బతుకులో అర్థం కావడం లేదు. ఆంధ్రులుగా దేనికి గర్వపడాలి. నా ఇంటికి వచ్చినప్పుడు నేను పట్టించుకుంటా అంటే ఎలా? నేను స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వబోతున్నారని ముందే చెప్పా.. ఆ టైంలో పోస్కో‌కి 2000 ఎకరాలు ఇస్తుంటే అందులో పనిచేసే ఉద్యోగులు తిరగబడ్డారు. ఇప్పుడు ఆ కంపెనీకి ఇస్తే గొడవ అవుతుందని వేరే కంపెనీలకు ఇస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలకు చెందిన వాళ్లు గ్రూప్‌గా ఏర్పడి.. 4 వేల కోట్ల రూపాయలు పెట్టారు. ఇవాళ దాని విలువ ఒక లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలు. దాన్ని ఇప్పుడు మళ్లీ నాలుగువేల కోట్లు రూపాయలకు అమ్ముతారట. అది ఎవరు భూమి? ఎవరికి అమ్ముతారు. 30 వేల ఎకరాల సామర్థ్యంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలో నాణ్యమైన స్టీల్‌ని తయారుచేస్తుంది. 2016లో కూడా వెయ్యికోట్లు లాభం వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు నష్టాల్లోకి పోతుంది అని నేను కనుక్కుంటే.. మనకి ఇనుప ఖనిజం గనులు లేవు అని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలకు తక్కువ ధరకు... విశాఖకు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రజల ఆస్తుల్ని రెట్టింపు చేస్తాం అని చెప్పి.. ప్రైవేట్ కంపెనీలకు ఆస్తుల్ని పెంచుతున్నారు. మూడు లక్షల కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బతుకుతున్నాయి. అలాంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తారా? బీజేపీ నేతలు ధర్మంగా చెప్పండి.. ఏం చేయబోతున్నారు ఈ రాష్ట్రాన్ని? ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? వ్యక్తిగతంగా మాట్లాడితే నాకూ తెలుసు ఎప్పుడు తాట తీయాలో.. దమ్ముంటే పాయింట్ మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు.. ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతుంది? ప్రభుత్వం ప్రశ్నిస్తుందో లేదో చూద్దాం.. ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుందనే అనుకుంటున్నా.. ప్రత్యేక హోదా రాకపోతే పిల్లల భవిష్యత్ ఏంటి అని ఆనాడు జగన్ గారే అన్నారు.. అది చాలా మంచింది.. జగన్ గారు ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మొదలుపెడితే ముందు వరసలో నేను ఉంటా.. కేంద్రం గన్ పెడితే ముందు నేను అడ్డుపడతా కాల్చేయండి అని.. నా పూర్తి మద్దతు ప్రభుత్వానికి ఇస్తా ’ అంటూ హాట్ కామెంట్స్‌లో మళ్లీ వార్తల్లోకి వచ్చారు హీరో శివాజీ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cIGghr

No comments:

Post a Comment

Why Meenakshi Seshadri Returned To India!

'My trajectory right now is five steps forward, two steps backwards.' from rediff Top Interviews https://ift.tt/L5RftyG