Saturday 13 February 2021

Vaishnav Tej: వైష్ణవ్‌ని పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చేశా.. నా తమ్ముడేనా వీడు అనిపించింది: సాయిధరమ్ తేజ్

మెగా హీరో ‘ఉప్పెన’ చిత్ర ప్రమోషన్స్‌లో మెగా డాటర్, మెగా హీరోస్ అంతా తలో చేయి వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయిన వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే హిట్ అందుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ సందేశ్, నాగబాబు, నిహారికలతో పాటు వైష్ణవ్ తేజ్ అన్నయ్య సాయి ధరమ్ తేజ్‌ కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో బాగానే ఇన్వాల్ అయ్యాడు. కాగా ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ అందుకోవడంతో మెగా కజిన్స్ వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, , నిహారికలు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక యాంకర్‌ని కూర్చోబెట్టి ప్రశ్నలు వేయించేట్టు కాకుండా.. ఈ నలుగురే ఉప్పెన చిత్రం గురించి సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తమ్ముడ్ని తొలిసారి హీరోగా స్క్రీన్‌పై చూసిన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు సాయి ధరమ్ ధరమ్ తేజ్. నా తమ్ముడ్ని సడెన్‌గా స్క్రీన్ మీద చూసేసరికి షాక్ అయ్యా.. ఏంటి వీడు వైష్ణవ్ గాడేనే.. చిన్న పిల్లోడు వీడు.. ఇంత పెద్దడు అయిపోయాడు అని చెప్పలేని ఆనందం వేసింది. ఫస్ట్ సీన్‌లో వాడిని చూడగానే కళ్లలో నుంచి నాకు తెలియకుండానే నీళ్లు వచ్చేశాయి. ఎందుకు అంటే.. వాడితో నేను చిన్నప్పుటి నుంచి గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చేశాయి. కళ్ల ముందు అన్నీ కనిపించాయి. చాలా షాకింగ్ మూమెంట్. కానీ సినిమా మొదలైన కాసేపటికి వైష్ణవ్ కనిపించలేదు.. కేవలం ఆశి అనే క్యారెక్టర్ మాత్రమే కనిపించింది. అంతలా ఇన్వాల్వ్ చేశాడు. సినిమా చూసినంతసేపు కళ్లు చెమ్మగిల్లుతూనే ఉన్నాయి. ఇక సినిమా అయిపోయిన తరువాత... వీడ్ని పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చేశా. వాడు కంట్రోల్ కంట్రోల్ అన్నా.. నా వల్ల కాలేదు.. వెరీ ప్రౌడ్‌రా అని గట్టిగా ఏడ్చేశా. మాటలు రాలేదు’ అంటూ రియల్ లైఫ్ ఎమోషనల్ సీన్‌ని ప్రేక్షకులతో పంచుకున్నాడు సాయి ధరమ్ తేజ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OtriSg

No comments:

Post a Comment

'How Can A 16 Year Old Be A BJP Agent?'

'I went to jail and met my father to convince him to join politics and believe in the Constitution.' from rediff Top Interviews ht...