Saturday 6 February 2021

Uppena: వినగానే షాకయ్యా, నోటి నుంచి మాట రాలేదు.. ఇది మరో రంగస్థలం అవుతుంది.. చిరంజీవి కామెంట్స్

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' మూవీ ఏ రేంజ్ హిట్టయిందో మనందరికీ తెలుసు. తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. చెర్రీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక నిర్మాతలకైతే లాభాల పంట పండింది. మరి అలాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాతో ఇప్పుడు 'ఉప్పెన' సినిమాను పోలుస్తూ మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు హీరోగా పరిచయం కాబోతున్న సినిమా 'ఉప్పెన'. సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. సుకుమార్‌ శిష్యుడు, న్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ నెల 12న సినిమా విడుదల సందర్భంగా చిరంజీవి ముఖ్యఅతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ''కరోనా భయాందోళనలతో ఓ సంవత్సర కాలం పాటు భవిష్యత్ ఏమిటో తెలియక ఆందోళన చెందాం. ఇప్పుడు థియేటర్లలో జనం హడావిడి చూస్తుంటే మళ్లీ ఓ శుభారంభంలా అనిపిస్తోంది. సినీ పరిశ్రమ మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోవడానికి కారణమైన ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ‘ఉప్పెన’ సినిమా ఒక దృశ్యకావ్యం, అద్భుతం అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇది మరో ‘రంగస్థలం’ మూవీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నాకు ఉన్న బలహీనతతో ఈ సినిమా కథ, అందులోని విషయమంతా లీక్ చేస్తాననే భయం వీళ్లకు ఉండొచ్చు. నాకు మైక్ ఇచ్చే ముందు అదే అనుకున్నారేమో గానీ అస్సలు అలా లీక్ చేయను. 'ఉప్పెన' సినిమా చూశాక నా మనసు ఆగలేదు. ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ మూవీ గురించి గొప్పగా ప్రజలందరికీ చెప్పాలనిపించింది. కానీ నాకు నేనుగా బలవంతంగా హోల్డ్ చేసుకున్నా. బుచ్చిబాబు చూపించిన పనితనం, దర్శకత్వ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. స్క్రీన్‌ప్లేకి ఇదొక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. దర్శకుడు సుకుమార్‌తో కలిసి బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఈ కథ ఎంత బాగుంది. లవ్ స్టోరిలు ఎన్నో చూశాం. ధనికుల అమ్మాయి పేదింటి అబ్బాయి కథలను ఎన్నో విన్నాం. ఇందులో ఉండే ఆ ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. ఈ మూవీ చూస్తుంటే 80, 90ల్లో భారతీరాజా తీసిన సినిమాలు గుర్తొచ్చాయి. ఇలాంటి మట్టి కథలే మన ఇండస్ట్రీకి కావాలి. మైత్రి మూవీస్ మేకర్స్ వారికి మరో 'రంగస్థలం' అవుతుంది'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tAP4fm

No comments:

Post a Comment

'Government Must Talk To Sonam Wangchuk'

'Ladakh has become a hollow UT.' from rediff Top Interviews https://ift.tt/MtBvKLU