టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరో '' అనే డిఫరెంట్ సబ్జెక్టుతో ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకొచ్చారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న ఆయనకు ఈ మూవీ కాస్త ఊరటనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ సహా ఇతర అప్‌డేట్స్ అన్నీ విడుదలకు హైప్ తీసుకురావడంతో చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ వచ్చాయి. పోటీగా మూడు సినిమాలున్నా కలెక్షన్స్ పరంగా 'నాంది' ఫర్వాలేదనిపించింది. చిత్రానికి వచ్చిన హైప్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. నైజాంలో రూ. కోటి, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఆంధ్రాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 20 లక్షలు సహా మొత్తంగా రూ. 2.70 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిసింది. టోటల్‌గా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా తొలిరోజు అన్ని ప్రాంతాల్లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. మొత్తంగా ఫస్ట్ డే వసూళ్లు దాదాపు 45 లక్షల మేర ఉండగా.. మౌత్ టాక్ బాగా రావడంతో సెకండ్ డే మరింత పుంజుకుంది. ఏరియాల వారిగా రిపోర్ట్స్ చూస్తే.. నైజాంలో 28 లక్షలు, సీడెడ్‌లో 8లక్షలు, ఉత్తరాంధ్రలో 6.2లక్షలు, ఈస్ట్ గోదావరి 5.1లక్షలు, వెస్ట్ గోదావరి 3.4లక్షలు, గుంటూరు 5.3లక్షలు, కృష్ణా 6.1లక్షలు, నెల్లూరు 3.1లక్షలు వసూలయ్యాయి. మొత్తం రెండు రోజుల్లో 1.95కోట్ల గ్రాస్ రాబట్టగా 1.1కోట్ల షేర్ వసూలు చేసి అల్లరోడు హవా నడిపిస్తున్నాడు. బ్రేక్ ఈవెన్‌కి మరో రెండు కోట్ల దూరంలో ఉండటంతో వచ్చే వారం పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు కీలకం కానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bqR8OD
No comments:
Post a Comment