Saturday 6 February 2021

Harish Shankar: మెగా ఫ్యామిలీ హీరోలపై హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరు ముందే ఇలా

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తన మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేశారు. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. వైష్ణవ్ తేజ్‏కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్‏గా నటిస్తున్న ఈ మూవీని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేయగా.. మంచి అంచనాలతో ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన స్పీచ్‌తో అదరగొట్టారు. మెగాస్టార్ ముందే మెగా పంచ్‌లు పేల్చారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తున్నప్పుడు బయట చిరంజీవి గారి కటౌట్ కనిపించింది. మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడ మొగల్తూరు.. ఎక్కడ చెన్నై.. ఎక్కడ ప్రయాణం.. ఎంతటి ప్రస్థానం.. వైష్ణవ్ తేజ్ వరకూ వచ్చింది.. ఇంకెంత దూరం వెళ్తుందో. నిజంగా భారతదేశంలో రాజ్ కపూర్ గారి తరువాత అంతటి అదృష్టం మళ్లీ మీకే (చిరంజీవి) దక్కింది సార్. ఈ అదృష్టం రాసిపెట్టి ఉండాలంతే. ఒక ఫ్యామిలీని ఇంతలా ఆదరించడం అంటే అది పూర్వజన్మ సుకృతం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గర సినిమా రిలీజ్ డేట్ కోసం మాట్లాడుతుంటే.. నెక్స్ట్ త్రీ మంత్స్ మన ఫ్యామిలీ హీరోల సినిమాలే ఉన్నాయి సార్ అంటే.. అప్పుడు కళ్యాణ్ గారు ఏమన్నారంటే.. మన ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ కాదు.. సినిమా ఇండస్ట్రీ మొత్తం మా ఫ్యామిలీనే అని అన్నారు. ఈ మాట చిరంజీవి గారు కూడా చాలాసార్లు అనుకున్నారు కాబట్టే.. కరోనా కష్ట కాలంలో సీసీసీ ద్వారా చాలామంది కడుపు నింపారు. కన్నీళ్లు తుడిచారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆర్య రిలీజ్ అయ్యింది. అప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా.. సుకుమార్‌ని చూడండయ్యా.. ఆర్య లాంటి కథ చెప్పండయ్యా అని అనేవారు. ప్రతి సినిమా ఆఫీస్‌లో ఆర్య, సుకుమార్ ఇదే మాట. ఇప్పుడు ఆయన శిష్యుడు బుచ్చిబాబు కంటిన్యూ చేస్తున్నాడు. ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు ఒకసారి దిల్ రాజు ఆఫీస్‌కి వచ్చాడు. అక్కడ నన్ను చూసి ‘సార్ మీ సినిమాలంటే చాలా ఇష్టం’ అని అన్నాడు. అబద్ధం ఇంత అందంగా చెప్తున్నానంటే.. మంచి డైరెక్టర్ అవుతాడని అనుకున్నా. కానీ కంటిన్యూ మైత్రి ఆఫీస్‌కి వెళ్లినా.. మళ్లీ మళ్లీ చెప్పేవాడు. ఇతను అబద్ధం అందంగా ఆడటం కాదు.. ఎవరికి ఏ అబద్ధం చెప్పాలో గుర్తుపెట్టుకుని మరీ చెప్తున్నాడు ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడని అనుకున్నా. కానీ ఆర్య సినిమాని అప్పుడు ఎలా చెప్పుకున్నారు.. ఇప్పుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమా గురించి అలాగే చెప్పుకుంటున్నారు. ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చింది మాత్రం దేవీ శ్రీ ప్రసాద్‌నే. రేప్పొద్దున్న బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ అయినా.. వైష్ణవ్ తేజ్ కొడుకు లాంఛ్ అయినా దేవి శ్రీనే మ్యూజిక్ చేస్తారని.. యాంకర్ సుమ హోస్ట్ చేస్తుందని అనిపిస్తుంది అంటూ చమత్కరించారు హరీష్ శంకర్. ఇక హీరో వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. పోలికలు దేవుడు ఇస్తాడు.. గుణం మనమే సంపాదించాలి. వైష్ణవ్ తేజ్‌ని ఫస్ట్ చూడగానే.. ఆయన తాతగారి కళ్లు గుర్తుకు వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rrNZVd

No comments:

Post a Comment

'Government Must Talk To Sonam Wangchuk'

'Ladakh has become a hollow UT.' from rediff Top Interviews https://ift.tt/MtBvKLU