ప్రముఖ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో సినిమాలు నిర్మిస్తున్న ఐదుగురు నిర్మాతలు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భూరి విరాళం చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ అధినేత ఎ.ఎం.రత్నం, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ - సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధిపతి ఎస్.రాధాకృష్ణ (చినబాబు), శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ సహ వ్యవస్థాపకుడు నవీన్ యెర్నేని, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధిపతి బండ్ల గణేష్ సంయుక్తంగా రూ.54.51 లక్షల విరాళాన్ని అయోధ్య రామ మందిరం నిర్మాణం నిమిత్తం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూ.30 లక్షలు విరాళం అందించిన విషయం తెలిసిందే. మూడు వారాల క్రితం తిరుపతి పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్.. అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రతినిధికి చెక్కు రూపంలో తన విరాళాన్ని అందించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో ఆయన నిర్మాతలు విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీకి నిర్మాతలు చెక్కులు అందించారు. పవన్ కళ్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఎ.ఎం.రత్నం నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అలాగే, మరోవైపు సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ‘అయ్యప్పనుం కోషియం’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తి కాగానే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయనున్నారు. వీటి తరవాత బండ్ల గణేష్ నిర్మించనున్న సినిమాలో నటిస్తారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qhFax5
No comments:
Post a Comment