‘అరె గుచ్చే గులాబిలాగా.. వెలుగిచ్చే మతాబులాగా.. కళతెచ్చే కల్లాపిలాగా.. నచ్చావులే బలేగా’ అంటూ విభ (పూజా హెగ్డే) మీద తన ఫీలింగ్‌ని పాట రూపంలో పాడుతున్నారు అఖిల్ అక్కినేని. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుండి రెండో పాటగా ‘గుచ్చే గులాబి’ని వాలంటైన్స్ డే సందర్భంగా శనివాం విడుదల చేశారు. పాట చాలా వినసొంపుగా ఉంది. గోపీ సుందర్ స్వరపరిచిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించారు. అనంత శ్రీరామ్, శ్రీమణి కలిసి ఈ పాటను రాశారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. జీఏ2 బ్యానర్‌లో ఇప్పటికే ‘భలే భలే మగాడివోయ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘గీత గోవిందం’, ‘ప్రతిరోజు పండగే’ వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే బ్యానర్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. జూన్ 19న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి, ఇప్పటి నుంచే సినిమాకు మంచి ప్రచారం కల్పించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ అందమైన పాటను విడుదల చేసింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేలా ఈ ‘గుచ్చే గులాబి’ పాట ఉంది. కిందటేడాది ‘బుట్ట బొమ్మ’ సాంగ్‌తో ఓ ఊపు ఊపిన అర్మాన్ మాలిక్ ఈ పాటను ఆలపించడం విశేషం. గోపీ సుందర్ మరోసారి తన క్లాసిక్ టచ్‌తో ఆకట్టుకున్నారు. కాగా, ఈ సినిమాలో ఇంకా ఆమని, మురళీ శర్మ, జయప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అభయ్, అమిత్ ముఖ్య పాత్రలు పోషించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా ప్రదీశ్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3agSRH9
No comments:
Post a Comment