Saturday, 13 February 2021

హీరోగా రక్షిత తమ్ముడు.. నిర్మాతగా ‘ఇడియట్’ హీరోయిన్

హీరోయిన్ రక్షిత గురించి పరిచయం అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ‘ఇడియట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఈ కన్నడ బ్యూటీ. తొలి సినిమాతోనే ఆకట్టుకున్నారు. ఆ తరవాత ‘పెళ్ళాం ఊరెళితె’, ‘నిజం’, ‘శివమణి’, ‘లక్ష్మీ నరసింహ’, ‘ఆంధ్రావాలా’, ‘అందరివాడు’ చిత్రాలతో బాగా పాపులర్ అయ్యారు. ఆమె చివరిగా తెలుగులో నటించిన చిత్రం ‘జగపతి’. 2005లో ఈ సినిమా వచ్చింది. అప్పటి నుంచీ మరో తెలుగు సినిమాలో రక్షిత కనిపించలేదు. ఇదిలా ఉంటే, రక్షిత ఇప్పుడు నిర్మాతగా మారారు. తన తమ్ముడు రానాను హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘ఏక్ లవ్ యా’ అనే సినిమా ద్వారా రానా పరిచయం అవుతున్నారు. కన్నడలో శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, దర్శన్, సుదీప్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు, రక్షిత భర్త జోగి ప్రేమ్.. ‘ఏక్ లవ్ యా’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో రక్షిత నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగులో అనువాదం చేసి విడుదల చేయనున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి పరిచయం అవుతున్నారు రానా. హీరోగా పరిచయం కావడానికి ముందు ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లీ స్ట్రాస్‌బర్గ్ స్కూల్‌లో రానా శిక్షణ పొందారు. అలాగే, కొన్ని కన్నడ సినిమాల్లో అప్రెంటీస్‌గా నటించడంతో పాటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. ఈ సినిమా కోసం రానా ప్రత్యేకంగా డాన్స్, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందారు. ప్రస్తుతం సౌత్ హీరోలంతా బహుభాషా చిత్రాలకే మొగ్గు చూపుతున్నారు. అందుకే, తాను ఒకేసారి నాలుగు భాషల్లో పరిచయం కావాలని రానా నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ద్వారా రీష్మ నానై హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. అలాగే, రచితా రామ్ మరో హీరోయిన్. అర్జున్ జన్య సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమా నుంచి తొలి పాటను వాలంటైన్స్ డే సందర్భంగా రేపు విడుదల చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rPUHo5

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw