Sunday 7 February 2021

ఉత్తరాఖండ్ జలప్రళయంపై సోనూసూద్, మహేష్ బాబు సహా సినీ ప్రముఖుల రియాక్షన్

ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌లో ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడిన ఘటన యావత్ భారతదేశాన్ని విషాదంలో నెట్టివేసింది. మంచు చరియలు విరిగిపడడంతో గంగానదికి ఉపనది అయిన ధౌలీగంగా నదికి వరద పోటెత్తింది. దీంతో ఆ నదిపై నిర్మిస్తున్న పవర్‌ ప్రాజెక్టు ధ్వంసం కావడంతో పాటు ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, సమీప ప్రజలు 150 మందికి పైగానే గల్లంతయినట్టు తెలిసింది. ఈ దుర్ఘటనపై టాలీవుడ్ సూపర్ స్టార్ సహా సోనూ సూద్, ఇతర సినీ నటులు స్పందిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఆదుకునే రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న సోనూ సూద్ స్పందిస్తూ.. 'ఉత్తరాఖండ్ మేం మీతోనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి' అని పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై మహేష్ బాబు రియాక్ట్ అవుతూ ఈ ఘటనలో గల్లంతైన వారు క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు, వారి గురించే ఆలోచిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడిన ఐటీబీపీ జవాన్లకు మహేష్‌ బాబు సెల్యూట్‌ చేశారు. యంగ్ హీరోయిన్ మెహ్రీన్ స్పందిస్తూ.. ''ఉత్తరాఖండ్ పవిత్ర ప్రాంతంలో వరద పరిస్థితిని చూసి గుండె పగిలిపోయింది. ఈ ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నా'' అని ట్వీట్ చేసింది. ఈ మేరకు గతంలో తాను గంగానదికి హారతి ఇస్తూ దిగిన ఫొటోను షేర్ చేస్తూ తిరిగి మామూలు స్థితికి రావాలని కోరుకుంది. ''ఇది చాలా కఠినమైన సమయం, వరదలో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడతారని, సహాయక బృందాలు అందరినీ రక్షిస్తాయని ఆశిస్తున్నా'' అని మాస్ మహారాజ్ రవితేజ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో వరద ముంపు వల్ల ప్రజలు ప్రాణాలు విడవడం బాధగా అనిపిస్తోంది. ఎవరైనా వరదల్లో చిక్కకుంటే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందండి అంటూ బాలీవుడ్ యాక్టర్ సిద్దార్థ మల్హోత్రా ట్వీట్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tEKQDe

No comments:

Post a Comment

'Omar Abdullah Is Seen As A Tourist'

'The Abdullah family is the problem and facilitator of the instability that we are seeing in Kashmir.' from rediff Top Interviews ...