Sunday 7 February 2021

నా కష్టాలు ఇంకా ఎక్కువే అవుతాయేమో! కారణం మీ ప్రేమనే.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

స్టార్ హీరోయిన్ అక్కినేని కోడలిగా ప్రమోషన్ పొందాక మరింత జోరుమీదుంది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గిస్తుందేమో అనుకుంటే అందరికీ షాకిస్తూ తన కెరీర్‌లో వినూత్న దారుల్లో వెలుతూ సత్తా చాటుతోంది. మొన్న నాగార్జునను రీ ప్లేస్ చేస్తూ బిగ్ బాస్ తెరపై సందడి చేసిన సామ్.. ఆ తర్వాత ఆహా ఓటీటీ వేదికపై సామ్ జామ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఆకట్టుకుంది. దీంతో సమంత పెళ్లి తర్వాత ఫాలోయింగ్ మరింత పెరుగుతూ వస్తోంది. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉండే సమంత, తన సినిమా విశేషాలతో పాటు భర్త నాగ చైతన్య, అక్కినేని ఫ్యామిలీ సంగతులు పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో అప్‌డేట్స్ కోసం నిత్యం సామ్ సోషల్ మీడియా ఖాతాలు వెతికే నెటిజన్లు ఎక్కువయ్యారు. ఆన్‌లైన్ వేదికపై దేశవిదేశాల్లో ఆమెకంటూ స్పెషల్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఓ అరుదైన ఫీట్ అధిగమించింది. ఆమె ఇన్స్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కోటిన్నర (15 మిలియన్లు)కు చేరింది. దీంతో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న సామ్ తన ఆనందం వ్యక్తం చేస్తూ అభిమానుల ప్రేమకు తన కృతజ్ఞతలు చెప్పింది. మీరు చూపించే ప్రేమ తనను మరింత శ్రమించేలా చేస్తోందని పేర్కొంది. ముందు ముందు మరింత కష్టపడి ఇలాగే మీ అందరి మెప్పు పొందుతూనే ఉంటానని ఆమె తెలిపింది. ప్రస్తుతం 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్‌తో బిజీగా ఉంది సమంత. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ మొదటి భాగం దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ సంపాదించుకుంది. అయితే రెండో సీజన్‌లో సమంత టెర్రరిస్ట్‌గా కనిపించనుండటం ఈ సిరీస్‌పై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా విడుదల కావాల్సిన ఈ సీరీస్‌ను వేసవికి వాయిదా వేసినట్టు ఇటీవలే సీరీస్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెలిపారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే భారీ మూవీ చేస్తోంది సమంత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cKYpv4

No comments:

Post a Comment

'Cancelling Adani Project Not Good Sign'

'If there is a push towards a Marxist oriented government it will be dangerous.' from rediff Top Interviews https://ift.tt/Iy8vqEL