
కొణిదెల .. చెప్పుకోవడానికి పెద్ద హీరోయినేమీ కాకపోయినా పాపులారిటీ పరంగా అమ్మడు ముందు వరుసలో ఉంటుంది. మెగా వారసురాలిగా వెబ్ సిరీస్‌లు, పలు సినిమాలతో ఆకట్టుకున్న ఆమె స్టార్ స్టేటస్ పట్టేయకముందే పెళ్లిపీటలెక్కేసింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడైన జొన్నలగడ్డ చైతన్యను పెళ్లాడింది. గతేడాది డిసెంబర్ 9వ తేదీన వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత తొలిసారి ఇద్దరూ కలిసి తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సరదాగా సీక్రెట్స్ అన్నీ ఓపెన్ చేసేసింది మెగా డాటర్. ఇంతకీ మీది లవ్ మ్యారేజా? లేక పెద్దలు నిర్ణయించిన పెళ్లా? అందరిలోనూ అదే సందేహం ఉంది.. కాస్త చెప్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నపై చైనిహారిక ఆసక్తికరంగా స్పందించారు. తమది లవ్ మ్యారేజ్ కాదని కన్ఫర్మ్ చేసింది నిహారిక. స్కూల్‌లో చదివే సమయంలో చైతన్య, వరుణ్ క్లాస్‌మెట్స్ కానీ.. ఆ సమయంలో తనకైతే చైతన్యతో పరిచయం లేదని చెప్పింది. ఆ వెంటనే చైతన్య స్పందిస్తూ తొమ్మిదో తరగతిలో వరుణ్, నేను క్లాస్‌మెట్స్ అని, ఒకటి రెండుసార్లు వాళ్ళ ఫాదర్‌ని కలిశానని చెప్పారు. దీంతో అప్పుడు వరుణ్‌కి ఒక చెల్లెలు ఉందని నీకు తెలుసు కదా! అని నిహారిక అడిగింది. తెలుసు అని చైతన్య చెప్పడంతో.. అంటే తొమ్మిదో తరగతి నుంచే ఇదంతా నా వెనుక కుట్ర అంటూ నవ్వేసింది నిహారిక. 2019లో తామిద్దరం కలిశామని చైతన్య చెప్పారు. ఇక కోవిడ్ లాక్‌డౌన్ తమకు చాలా మంచి చేసిందని నిహారిక పేర్కొంది. ఏడు నెలల్లో ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నామని ఆమె తెలిపింది. ఆ సమయంలో బయట కలవకపోయినా మా ఇంట్లోనే ఇద్దరం కలుసుకునే వాళ్లమని, అలా తను ఇంటికి వస్తుండటంతో చక్కటి రిలేషన్ బిల్డ్ చేసుకున్నామని చెప్పింది. పెళ్లికి ముందు తామిద్దరం వీడియో కాల్స్ ఎక్కువగా చేసుకునేవాళ్లమంటూ సీక్రెట్స్ బయటపెట్టింది నిహారిక. తనతో చైతన్య చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, అదే ఆయనలో నచ్చుతుందని ఆమె చెప్పుకొచ్చింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pKXcXs
No comments:
Post a Comment