Thursday 4 February 2021

కాంతారావు సతీమణి హైమావతి కన్నుమూత

దివంగత సినీ నటుడు సతీమణి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 87 సంవత్సరాలు. హైదరాబాద్ లోని మల్లాపూర్‌లో నివాసం ఉంటున్న ఆమె.. నిన్న (గురువారం) మధ్యాహ్నాం 12 గంటలకు తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. హైమావతి మరణవార్త తెలిసి పలువురు సినీ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వెండితెరపై కత్తియుద్ధాలతో అశేష ప్రేక్షకులను అలరించారు కాంతారావు. కానీ కత్తుల్లాంటి సమస్యల నుంచి తన కుటుంబాన్ని మాత్రం గట్టెక్కించుకోలేకపోయారు. ‘ప్రతిజ్ఞ’ సినిమాతో 1953లో చిత్ర సీమకు పరిచయమైన ఆయన దాదాపు 100 చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన చేసిన ఇతర పాత్రలు కూడా కలిపి చూస్తే దాదాపు 450 సినిమాల్లో నటించారు. కాకపోతే సినీ కెరీర్ ఆయన కుటుంబానికి అస్సలు కలిసిరాలేదు. కొన్ని చిత్రాలు నిర్మించి అప్పులపాలైన ఆయన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. ఆప్తులు అందించిన ఆర్థికసాయంతో కాలం వెళ్లదీస్తూ 2009 సంవత్సరంలో అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటినుంచి ఆయన కుటుంబం అద్దె ఇళ్లలో ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. కాంతారావుగారు సినిమాలు తీసి ఆస్తి పోగొట్టుకున్నారు గానీ, చెడు వ్యసనాల వల్ల కాదని గతంలో అయాన్ సతీమణి హైమావతి మీడియాతో చెప్పారు. ప్రభుత్వ సహకారం కావాలని పలు సందర్భాల్లో ఆమె అభ్యర్థించారు. కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cG8b1l

No comments:

Post a Comment

'Rahul Has To Be More Ruthless'

'I want to ask the Congress only one question: What is more important than election management in politics?' from rediff Top Inter...