Sunday 14 February 2021

వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేనా టైపు కాదు: ప్రభాస్ క్లారిటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్ ‘రాధేశ్యామ్’. పాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. విడుదలవుతోన్న అన్ని భాషల్లోనూ ‘రాధేశ్యామ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌లు, మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే, ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ‘రాధేశ్యామ్’ రొమాంటిక్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ బుల్లి వీడియోను చూస్తుంటే రేపు వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు ఖాయం అనిపిస్తోంది. అంత అందంగా ఉన్నాయి విజువల్స్. యూరప్ అందాలను మునుపెన్నడూ చూపించనంత అందంగా ఈ సినిమాలో ఆవిష్కరించారని అర్థమవుతోంది. హాలీవుడ్ మూవీ రేంజ్‌లో విజువల్స్ కనిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రభాస్, పూజా హెగ్డే ప్రెజెన్స్ మరో ప్రధాన ఆకర్షణ. ‘సే యున్ ఏంజిలో. దేవ్ మోరిరే పెరింట్రార్తి’ అంటూ ప్రభాస్ ఇటాలియన్‌లో పలికిన సంభాషణలు ఆకట్టకున్నాయి. ఈ ఇటాలియన్ డైలాగ్‌కు అర్థం ‘నువ్వొక దేవతవి. నిన్ను కలుసుకోవడానికి నేను చనిపోయినా పర్వాలేదు’ అని. అందుకే, ఈ వీడియోలో ఆ త‌రువాత పూజా హెగ్డే ప్రభాస్‌ను ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని అడిగితే.. దానికి స‌మాధానంగా ‘వాడు ప్రేమ‌కోసం చచ్చాడు, నేనలా కాదు’ అని ప్రభాస్ సమాధానం ఇచ్చారు. డైలాగ్స్‌తో పాటు విజువల్స్, నేపథ్య సంగీతం వీడియోకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. డాక్టర్ యూవీ కృష్ణంరాజు స‌మ‌ర్పణ‌లో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధలు భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్’ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జ‌స్టిన్ ప్రభాక‌ర‌న్ తెలుగు, క‌న్నడ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్షన్స్‌కు సంగీతం సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కు మిథున్, మనన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. జులై 30న‌ ఏక‌కాలంలో హిందీ, త‌మిళ‌, తెలుగు, క‌న్నడ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో ‘రాధేశ్యామ్’ విడుదలవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jR1fQH

No comments:

Post a Comment

'Looking to expand international business'

'It is difficult to write business internationally, without an 'A-' rating. It becomes more expensive.' from rediff Top In...