Sunday, 6 December 2020

Naga Babu: నిహారిక వెళ్లిపోతోందిగా! ఇక నా టైమ్‌పాస్ అంతా.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్

ఆడపిల్ల పెళ్లి అంటే ప్రతి ఇంట్లో అదో మహా వైభోగం. తల్లిదండ్రులు తమ బాధ్యతగా కన్న కూతురిని అల్లుడి చేతిలో పెట్టే శుభ గడియ ఓ మెమరబుల్ మూమెంట్. కాకపోతే ఇన్నాళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు పుట్టినింటి నుంచి మెట్టినింట అడుగుపెడుతుంటే ఆ తల్లిదండ్రులు పెట్టుకునే ఆనంద భాష్పాలను వర్ణించడానికి మాటలు చాలవు. ప్రస్తుతం అదే మూడ్‌లో ఉన్నారు మెగాబ్రదర్ . ఈ మేరకు తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె వివాహం డిసెంబర్ 9వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్ లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లాడనుంది నిహారిక. వారం ముందునుంచే నాగబాబు ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే నిహారికను పెళ్లికూతురు చేసేశారు. ఈ నేపథ్యంలో నాగబాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో ఆ పోస్ట్ వైరల్ అయింది. ఇంట్లో నిహారిక లేని లోటును నాగబాబు తన పెంపుడు కుక్క పీకూతో తీర్చుకోబోతున్నట్లు హింట్ ఇచ్చారు నాగబాబు. ఈ మేరకు 'ఇకపై పీకూ నా తలగడ' అంటూ భావోద్వేగ గపూరిత కామెంట్ చేస్తూ పీకూతో దిగిన పిక్ షేర్ చేశారు. Also Read: మరోవైపు పెళ్లి కూతురు నిహారిక ఎప్పటికప్పుడు తన మ్యారేజ్ సెలబ్రేషన్స్ తాలూకు ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. ముఖ్యంగా చిరంజీవి కూతుళ్లు శ్రీజ, సుస్మిత ఈ వేడుకలో తెగ సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9వ తేదీన జరగనున్న నిహారిక పెళ్లి వేడుక మెగా లోకానికి కన్నుల పండగగా మారనుంది అని చెప్పుకోవడంతో అతిశయోక్తి లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39H4asa

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....