Sunday, 6 December 2020

32 ఏళ్ల క్రితం నాటి చీరలో నిహారిక.. దీనికో ప్రత్యేకత ఉంది!

మెగా బ్రదర్ నాగబాబు ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. ఆయన కుమార్తె వివాహం ఈనెల 9న జరగనున్న విషయం తెలిసిందే. నిహారికను శనివారం పెళ్లి కుమార్తెను చేశారు. నిహారికను పెళ్లికూతురుని చేసే శుభకార్యాన్ని హైదరాబాద్‌లోని స్వగృహంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. నిహారికకు పసుపు రాసి మంగళ స్నానం చేయించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Also Read: ఇదిలా ఉంటే, నిహారికను ఆదివారం కూడా పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు. అయితే, ఈరోజు నిహారిక అలంకరణలో ప్రత్యేకత ఉంది. ఆమె తన తల్లి పద్మజ చీర కట్టుకుని ముస్తాబయ్యారు. ఈ చీర కూడా ఇప్పటిది కాదు.. 32 ఏళ్ల క్రితం నాటిది. పద్మజ నిశ్చితార్థం చీర. ఈ విషయాన్ని నిహారిక స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. 32 ఏళ్ల క్రితం నిశ్చితార్థం రోజున తన తల్లి ఈ చీరలో ముస్తాబైన ఫొటోను, తన ప్రస్తుత ఫొటోను పక్కపక్కన పెట్టి షేర్ చేశారు. కాగా, గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌ రావు కుమారుడు వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి బంధంతో నిహారిక, చైతన్య ఒక్కటవ్వబోతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌‌లో వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లికి ఐదు రోజుల ముందు హైదరాబాద్‌లో నాగబాబు ఇంట పెళ్లి సందడి మొదలైంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gfaNDc

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....