Sunday, 27 December 2020

చిన్నప్పుడు అల్లు అర్జున్..! సమంత ప్రశ్నలకు దండం పెట్టేసిన అల్లు అరవింద్.. టాప్ ట్రెండింగ్ వీడియో

నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదంటూ ఆహా వేదికపై 'సామ్ జామ్' ప్రోగ్రాం ప్రారంభించిన అక్కినేని అన్నట్లుగానే ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీల సీక్రెట్స్ వారి చేతనే చెప్పిస్తూ ప్రోగ్రామ్‌ని విజయవంతంగా నడిపిస్తోంది. ముఖ్యంగా హోస్ట్ రూపంలో సమంత ముద్దు ముద్దు మాటలు బాగా అట్రాక్ట్ చేస్తుండటం ఈ షోకి మేజర్ ఎసెట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ విజయ్ దేవరకొండతో మొదలుపెట్టి మొన్న చిరంజీవి వరకూ అందరితో సరదాగా మాట్లాడిన సామ్.. తాజాగా , అల్లు అరవింద్‌లతో మజా చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ ముగియగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆమె ఎపిసోడ్ చేయడం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఇకపోతే న్యూ ఇయర్ కానుకగా ఆహా ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానున్న ఈ షో తాలూకు ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. , అల్లు అర్జున్‌, అల్లు అయాన్‌లను సమంత డీల్ చేసిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో మొదటిస్థానంలో నిలిచింది. ఇక ఈ ప్రోమోలో హైలైట్ సన్నివేశాల విషయానికొస్తే.. మొదట అల్లు అర్జున్ కొడుకు అయాన్‌తో సమంత మాట్లాడటం చూపించారు. 'మా డాడీని ఓ ప్రశ్న అడగండి' అని అయాన్ సమంతకు చెప్పడంతో ఆమె ఎస్ అనేసింది. ఆ ప్రశ్న ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. మిమ్మల్ని స్టైలిష్ స్టార్ అని ఎందుకంటారు? అని బన్నీని ప్రశ్నించడం.. అలాగే బన్నీ చాలా హార్డ్ వర్కర్ అని సమంత చెప్పడం ఈ ప్రోమో వీడియోలో హైలైట్ అయ్యాయి. ఇక అల్లు అర్జున్ కూడా తనవంతుగా ఫన్ క్రియేట్ చేశారు. తండ్రయ్యాక ఇంట్లో బూతులు మాట్లాడటం తగ్గించా అంటూ ఓపెన్ కావడంతో సమంత ఓ రేంజ్‌లో నవ్వేసింది. ఆ తర్వాత అల్లు అరవింద్ ఎంట్రీ.. అతనిపై సమంత చిపిలిగా ప్రశ్నల వర్షం కురిపించింది సామ్. చిన్నప్పుడు కూడా అల్లు అర్జున్ ఇలానే హార్డ్ వర్కింగ్, డిసిప్లేన్‌గా ఉండేవారా? అని సామ్ వేసిన ప్రశ్నకు అల్లు అర్జున్ ఏకంగా దండం పెట్టేశారు. సో.. ఈ ఫన్నీ ఎపిసోడ్ పూర్తిగా చూడాలంటే జనవరి 1 వరకు ఆగాల్సిందే మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WQLBKk

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...