హీరోయిన్ నుంచి లేడీ విలన్‌గా మారి తమిళ, తెలుగు భాషల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది . ఏ విషయాన్నైనా దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె నైజం. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో విలన్‌గా కనిపించిన వరలక్ష్మి తర్వలోనే రవితేజ ‘క్రాక్’ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలతో కెరీర్ గురించి ఎన్నో ముచ్చట్లు చెప్పుకొచ్చింది వరలక్ష్మి.
‘నేను తెలుగు సినిమాలూ చూస్తుంటా. టాలీవుడ్‌లో నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బాహుబలి తమిళంలో విడుదలైనప్పటికీ నేను తెలుగులోనే చూశా. ప్రభాస్‌తో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనేది నా డ్రీమ్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నా మాటతీరు చూసి మగాడి గొంతులా ఉందని చాలామంది విమర్శించారు. అయితే... ఇప్పుడు ఆ మాట తీరే నా కెరీర్‌కు ప్లస్ పాయింట్ అయ్యింది. నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి చేరుకున్నా’ Also Read: ‘నా దృష్టిలో అమ్మ అంటే ఒక్కరే. అందుకే రాధికు ఆంటీ అని పిలుస్తాను. చాలామంది ‘నువ్వు అంత ధైర్యంగా ఎలా మాట్లాడతావు’ అంటూంటారు. దానికి స్ఫూర్తి మా అమ్మ ఛాయానే. చిన్నతనం నుంచీ అమ్మ మా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎలాంటి సమస్య ఎదురైనా ఒంటరిగా పోరాడింది. రాధిక ఆంటీతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆంటీ ఫ్యాషన్‌పైన పెట్టే శ్రద్ధ, కట్టుకునే చీరలూ వాటికి మ్యాచ్ అయ్యేలా పెట్టుకునే నగల్ని చూస్తే వావ్ అనిపిస్తుంది. నాకు సినిమా అవకాశాలు రాకపోతే డాన్సర్‌గా స్థిరపడాలనుకున్నా. దానికి తగినట్లుగా డిగ్రీ, పీజీ చేస్తూనే మరోవైపు భరతనాట్యం, జాజ్, హిప్‌హాప్ వంటివి నేర్చుకున్నా. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నాకు నటనపైన ఇష్టం పెరిగి ఆ దిశగా ప్రయత్నాలు చేశాను. అవన్నీ నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి’ అని చెప్పుకొచ్చింది వరలక్ష్మీ శరత్‌కుమార్. Also Read:from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nTOaHx
No comments:
Post a Comment