Wednesday, 30 December 2020

తిరుమల శ్రీవారి సేవలో సునీత.. పెళ్లి డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించిన ఫేమస్ సింగర్

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ రెండో వివాహానికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ తన నిశ్చితార్థపు ఫొటోలు షేర్ చేశారు సునీత. డిజిట‌ల్ మీడియా ప‌ర్స‌న్ రామ్ వీర‌ప‌నేనిని త‌ను వివాహం చేసుకోబోతున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. దీంతో సునీత రెండో వివాహం తాలూకు విషయాలు నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి డేట్ కన్ఫర్మ్ చేసిన ఆమె.. పెళ్లికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 10 నెలల అనంతరం స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జ‌న‌వ‌రి 9న త‌మ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని సునీత పేర్కొన్నారు. త‌న‌కు మంచి జీవితాన్ని అందించాల‌ని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికే ఇప్పటికే సునీత నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఘనంగా జరిగాయి. శనివారం (డిసెంబర్ 26) సాయంత్రం జరిగిన సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరై ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. నిజానికి డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకోవాల‌ని ఈ జంట భావించిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి జాత‌కాల ప్ర‌కారం స‌రైన ముహూర్తాలు లేక‌పోవ‌డంతో జ‌న‌వ‌రి 9వ తేదీన ఈ మూడు మూళ్ళ బంధానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత.. కొన్నేళ్ల తర్వాత భర్తతో విడాకులు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతను మోస్తూ ఒంటరిగానే ఉంటున్న ఆమె.. ఇన్నేళ్ల తర్వాత మరో కొత్త ప్రయాణం మొదలు పెడుతుండటం విశేషం. కరోనా నిబంధనలు పాటిస్తూ జరగనున్న వేడుకలో కేవలం ఆమె కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n6jLnX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....