Saturday, 26 December 2020

Sri reddy: లిమిట్స్ క్రాస్ చేస్తున్నావ్ సమంత.. ఆ బట్టలేసి ఎందుకీ రచ్చ! నమ్రతను లాగుతూ షాకింగ్ కామెంట్స్

నాగ చైతన్యను పెళ్ళాడి అక్కినేని వారింట అడుగుపెట్టాక సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది సమంత. ఇటు వెండితెరపై సత్తా చాటుతూనే అటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మంచి జోష్‌లో ఉంది. ఇక ఆమె సోషల్ మీడియా యాక్టివ్‌నెస్ గురించి మనందరికీ తెలిసిందే. మోడ్రన్‌గా ఉండటం ఎక్కువగా ఇష్టపడే ఆమె.. ఎప్పుడూ మోడ్రన్‌ దుస్తుల్లో మెరుస్తుంటుంది. అయితే పెళ్లయ్యాక కూడా స్పీడ్ చూసి కొందరు అభినందిస్తుంటే.. ఆమె వేషాధారణ, వేసుకుంటున్న బట్టలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయంటూ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది సంచలన తార . ఏ చిన్న సందర్భం దొరికినా సెలబ్రిటీలపై విరుచుకుపడుతున్న శ్రీ రెడ్డి.. కొన్నిరోజుల క్రితం సమంత బికినీ లుక్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బాత్‌టబ్ జలకాలాడుతూ హాట్ పోజిచ్చిన తన బికినీ లుక్ పోస్ట్ చేస్తూ సమంత తన ఫొటోలతో వ్యాపారం చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ మరోసారి సమంతపై విరుచుకుపడింది శ్రీ రెడ్డి. ''సమంతా.. ఏంటి ఆ డ్రెస్సులు బీభత్సంగా..! అక్కినేని ఫ్యామిలీలో అమలా గారు ఎంత మంచిగా డ్రెస్‌లు వేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆమెను చూస్తే చాలా యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంది. పశువుల మీద ప్రేమతో సంస్థను ప్రారంభించడం, పిల్లలను పెంచడం ఎన్నో మంచి పనులు చేస్తుంటుంది. ఇక నాగార్జున నాకు ఎలాగూ నచ్చరు. అది వేరే విషయం. కానీ ఓ ఫ్యాన్‌గా నీ డ్రెసింగ్ సెన్స్ నాకు నచ్చడం లేదంటూ సమంతపై ఫైర్ అయింది శ్రీ రెడ్డి. ''నమ్రత శిరోద్కర్ చూడండి మహేష్ బాబుకు ఎంత సపోర్ట్‌గా ఉంటుందో!. మహేష్ బాబు ఇంత సక్సెస్‌గా ఎదగడానికి కారణం శిరోద్కర్. నాగ చైతన్యకు మూవీ ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ లేవు.. అంత క్రేజ్ లేదు. నువ్వు కూడా అతని కెరీర్ చూసుకోవచ్చు కదా. బట్టలిప్పుకుని ఈ రచ్చ ఎందుకు? పోనీ అవేమైనా నీకు సూట్ అయ్యాయా అంటే అది లేదు. నువ్ సెక్సీ కాదు సమంత.. నువ్ నీ అందాలన్నీ బయటపెట్టినా పెద్దగా ఉపయోగం లేదు. క్యూట్‌నెస్ ఉంది నీకు కానీ హాట్‌నెస్ లేదు. దయచేసి ఈ బట్టలేసుకుని జనాలను ఇబ్బంది పెట్టకు. నువ్వు తమిళ్ అమ్మాయివి.. కానీ తెలుగబ్బాయిని పెళ్లి చేసుకున్నావ్. పెళ్లయ్యాక లిమిట్స్ క్రాస్ చేస్తున్నావ్. అభిమానులుగా మాకది నచ్చడం లేదు. నాగ చైతన్య లైఫ్ మీద, సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టండి'' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KRJmUq

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....