
నిన్న (డిసెంబర్ 25) ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పండగ వేళ తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కినేని ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరి ఫోటోలు దిగారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన భార్య అమల.. తమ కుటుంబం తరఫున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. అమల, నాగ చైతన్య, , అఖిల్, సుమంత్, సుశాంత్‌తో పాటు నాగార్జున ఫ్యామిలీ అంతా ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సకుటుంబ సపరివార సమేతంగా నాగార్జున ఫ్యామిలీ పిక్ చూసి మురిసిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ లవ్లీ పిక్ షేర్ చేసినందుకు థాంక్యూ మేడం అంటూ అమలకు కృతజ్ఞతలు చెబుతున్నారు అక్కినేని అభిమానులు. అక్కినేని ఫ్యామిలీలో అందరూ స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లే. ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అక్కినేని నాగేశ్వర్ రావు కొన్ని దశాబ్దాల పాటు అలరించారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున అదే రేంజ్ పాపులారిటీ కూడగట్టుకొని అక్కినేని హీరోగా సత్తా చాటారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు నాగ చైతన్య, సమంత, అఖిల్ చేపట్టారు. చైతూ ఖాతాలో ఇప్పటికే పలు హిట్ సినిమాలు పడ్డాయి కానీ అఖిల్ బెస్ట్ హిట్ కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pnvX5t
No comments:
Post a Comment