Monday, 28 December 2020

నా డైరీలో ఆ పదమే లేదు.. పెళ్లి వార్తలపై హన్సిక ఘాటు రిప్లై

అవకాశాలు వచ్చినంత కాలం వరుస సినిమాలు చేసేయాలి.. కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిలై పోవాలి. ప్రస్తుతం హీరోయిన్లందరూ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇది. అయితే తాను ట్రెండ్ ఫాలో కానని.. సెట్ చేస్తానంటూ గబ్బర్‌సింగ్ డైలాగులు చెబుతోంది హన్సిక. ‘దేశముదురు’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక్కడి నుంచి కోలీవుడ్‌కి వెళ్లాక ఆమె ఫేటే మారిపోయింది. వరుస సినిమాలతో అక్కడ స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకుంది. దీంతో కన్నడ, మలయాళ సినిమాల్లోనూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో హన్సిక కెరీర్ నెమ్మదించింది. కొత్త హీరోయిన్ల రాకతో ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. దీంతో హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోనుందంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తలకు హర్ట్ అయిన హన్సిక తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెగేసి చెప్పేసింది. ‘నా డైరీలో పెళ్లి అనే మాటకు ఇప్పట్లో చోటు లేదు. కెరీర్ స్లో అయితే వెంటనే పెళ్లి చేసేసుకోవాలా?’ అని ఎదురు ప్రశ్నిస్తోంది. తాజా వ్యాఖ్యలతో ఈ అమ్మడికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లే తెలుస్తోంది. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే ఓటీటీల వైపు మళ్లే ఆలోచనలేమైనా చేస్తుందేమో అని వర్గాలు లోలోపల చర్చించుకుంటున్నాయి. గతంలో బొద్దుగా ఉంటే హన్సిక లాక్‌డౌన్ సమయంలో బాగా వర్కౌట్లు చేసి స్లిమ్‌ లుక్‌లో దర్శనమిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34Qyk8S

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O