Monday, 28 December 2020

ఇన్ని జరిగినా తప్పుగా మాట్లాడకపోవడం షకీలా గొప్పతనం.. శృంగార తార క్యారెక్టర్‌పై రిచా చద్దా కామెంట్స్

ఒకానొక సమయంలో శృంగార తారగా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది షకీలా. చిన్న సినిమాలతో భారీ విజయాలందుకొని నిర్మాతలకు లాభాల పంట పండించిన ఘనత ఆమె సొంతం. అయితే వ్యక్తిగత జీవితం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ నిలదొక్కుకుంది షకీలా. సొంత కుటుంబమే మోసం చేసినా ఆ బాధను దిగమింగుకుంటూ వెండితెరపై రసికప్రియులను మత్తెక్కించింది. ఈ క్రమంలో ఆమె జీవితం, పడిన కష్టాల ఆధారంగా 'షకీలా' బయోపిక్ రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి లీడ్ రోల్ పోషిస్తోంది. షకీలా జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు డైరెక్టర్ ఇంద్రజీత్‌ లంఖేష్. ఈ నెల 25న హిందీలో రిలీజ్ చేసిన ఆయన 2021 జనవరి 1వ తేదీన ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'షకీలా' తెలుగు ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన రిచా చద్దా.. షకీలా క్యారెక్టర్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. కెమెరా ముందు షకీలా రోల్ పోషించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని పేర్కొన్న రిచా.. ఈ సినిమా గురించి పలు విషయాలు వెల్లడించింది. షకీలా పాత్రలో లీనం కావడం కోసం చాలా కష్టపడ్డానని, మళయాలంలో ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిన సినిమాల లిస్ట్ తెప్పించుకొని అన్ని సినిమాలను చూసి అనుకరించానని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితం, వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నానని పేర్కొంది. కెరీర్ పరంగా, కుటుంబం పరంగా నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడకపోవడం షకీలా మంచి గుణానికి నిదర్శనమంటూ కొనియాడింది రిచా చద్దా. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ 'షకీలా' బయోపిక్‌లో రిచా చద్దాతో పాటు పంకజ్‌ త్రిపాఠి, మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై ముఖ్య పాత్రలు పోషించారు. షకీలా వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లు, ఆమె సక్సెస్ అన్నీ ఈ సినిమాలో చూపించనున్నారు. ‌


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rvbptz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....