Sunday, 27 December 2020

నాగార్జున దరిద్రపు పని చేశాడు.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

కింగ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ రియాలిటీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా మహిళలను అగౌరవపరుస్తున్నారని నారాయణ గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ షోపై మరోసారి నారాయణ మండిపడ్డారు. అక్కినేని నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల గురించి ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. రాజకీయాల్లోకి సినీ నటులు రావడంపై కూడా మాట్లాడారు. ఈ అంశం గురించి మాట్లాడుతూ మధ్యలో నాగార్జున, బిగ్ బాస్ షో దగ్గరికి వెళ్లిపోయారు. ‘‘ఈ మధ్య సినిమా యాక్టర్స్ రాజకీయాల్లోకి వస్తున్నారు. నాకు తెలిసి సినీ రంగానికి చెందినవారిలో యన్.టి.రామారావు, ఎంజీ రామచంద్రన్ వీరిద్దరే రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ఇంకెవ్వరూ సక్సెస్ కాలేదు. భవిష్యత్తులో కూడా ఏ సినిమా యాక్టర్ సక్సెస్ కాడు. భ్రమలు పెట్టుకోకండి. రజినీకాంత్, పవన్ కళ్యాణ్ సహా ఎవ్వరూ సక్సెస్ కారు. అయిపోయింది.. ఎన్టీఆర్, ఎంజీఆర్‌తోనే పోయింది. కళామ్మతల్లికి సేవ చేసుకోండి, బతకండి. కళామ్మతల్లికి సేవ చేసేవాళ్లని ఆదరిస్తారు. నాకు కూడా అక్కినేని నాగార్జున అంటే చాలా అభిమానం. ఆయన సినిమాలు చూస్తా. కానీ, అట్టాంటి దరిద్రపు పని చేశాడు. బిగ్ బాస్ షోలో మూడు అమ్మాయిల ఫొటోలు పెట్టాడు. అభి అనే హీరోని పిలిచాడు. ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు.. ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు.. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే, వాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా.. ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా.. ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తా అంటాడు. ఓపెన్‌గా! అంటే, ముగ్గురు అమ్మాయిల ఫొటోలు అక్కడ పెట్టి వాళ్లకు అన్యాయం చేశారు. మరి, నాగార్జునకు కూడా ఇంట్లో సినిమా యాక్టర్లు ఉన్నారు కదా. వాళ్ల బొమ్మలు పెట్టొచ్చుగా? ఎందుకు ఈ అమాయకుల బొమ్మలు పెట్టాడు? ఇంత పెద్ద పేరు ఉన్న సినిమా యాక్టర్లు మహిళా లోకానికి అన్యాయం చేస్తుంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెడితే వాళ్లు తీసుకోలేదు. స్థానిక కోర్టు, జిల్లా కోర్టు తీసుకోలేదు. ఇప్పుడు హైకోర్టుకు వెళ్తున్నాను. రేపో ఎల్లుండో బిగ్ బాస్‌పై హైకోర్టులో కేసు పెడతా. సినిమా వాళ్లకు చట్టాలు కూడా భయపడుతున్నాయి. పితృభూమి కాదు మనది మాతృభూమి. మహిళలకు ఇచ్చే స్థానం ఇదేనా. మహిళలకు అన్యాయం చేస్తూ నాగార్జున అలా మాట్లాడితే ఎలా? కోట్లు రావచ్చు.. బిగ్ బాస్ వెనకాల పెద్ద కోటీశ్వరుడు ఉండొచ్చు.. కానీ, మహిళలకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇలాంటి పనికి మాలినవాళ్లా రాజకీయాల్లోకి వచ్చేది. ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడే కళాకారులకు రాజకీయాల్లోకి అవకాశం ఇవ్వకూడదు’’ అని నారాయణ ఘాటుగా మాట్లాడారు. మరి నారాయణ వ్యాఖ్యలపై నాగార్జున కానీ, బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్పందిస్తారేమో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rxOoGA

No comments:

Post a Comment

'Difficult To Trust Yunus Govt In Dhaka'

'It was the hostility of the Yunus regime that made India careful and wary of dealing with them.' from rediff Top Interviews https...