Thursday, 31 December 2020

2020కి గుడ్ బై చెప్పేసిన ఖిలాడీ.. 2021 సర్‌ప్రైజ్‌తో రెడీగా ఉన్న రవితేజ.. ఇదీ విషయం

ఎన్నో అనుభవాలు.. మరెన్నో జ్ఞాపకాలు మిగిల్చిన 2020 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ తన లేటెస్ట్ మూవీ '' అప్‌డేట్ ఇచ్చారు మాస్ మహారాజ్ . రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి 2021 సర్‌ప్రైజ్ రెడీగా ఉందని తెలిపారు. రేపు అనగా 2021 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు సిద్ధంగా ఉండండని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా రాబోతున్న ఈ 'ఖిలాడీ' మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ మాస్ అభిమానులను యమ అట్రాక్ట్ చేస్తూ విశేష స్పందన తెచ్చుకుంది. Also Read: ప్రస్తుతం ‘ఖిలాడీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్న రవితేజ.. ఇటీవలే సెట్స్ మీద దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి 'ఇన్ యాక్షన్ మోడ్' అంటూ క్రేజీ క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఖిలాడీ వెయిటింగ్ ఇక్కడ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు రవితేజ ఫ్యాన్స్. మరోవైపు రవితేజ లేటెస్ట్ మూవీ 'క్రాక్' సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. సమ్మర్‌లో 'ఖిలాడీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. సో.. రవితేజ స్పీడు చూస్తుంటే వచ్చే ఏడాది మాస్ మహారాజ్ అభిమానులకు కన్నుల పండగే అని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34YeMj9

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....