Thursday, 31 December 2020

రవితేజ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. డబుల్ ఇంపాక్ట్ అంటూ రంగంలోకి మాస్ మహారాజ్

2020 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ 2021 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు సర్‌ప్రైజ్ ఉంటుందని ముందుగానే చెప్పిన రవితేజ.. తాజాగా తన లేటెస్ట్ మూవీ ''కి సంబంధించి స్పెషల్ అప్‌డేట్ ఇచ్చారు. న్యూ ఇయర్ కానుకగా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నారు. కళ్లజోడు పెట్టుకొని భయపడుతూ ఓ గెటప్‌లో కనిపించగా, చేతిలో గన్ పట్టుకొని మరో గెటప్‌లో అదరగొట్టేశాడు మాస్ మహారాజ్. రవితేజ డబుల్‌ యాక్షన్‌ చేస్తున్న ఈ సినిమా నుండి డబుల్‌ ఇంపాక్ట్‌ పక్కా అంటూ చిత్ర యూనిట్ ఈ పోస్టర్‌ విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ 'ఖిలాడీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానులను నుంచి భారీ స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఖిలాడీ టీమ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LeQMRC

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...