Wednesday, 30 December 2020

భర్త నాగ చైతన్యతో సమంత న్యూ ఇయర్ ట్రిప్.. గోవాలో చిల్ కాబోతున్న రొమాంటిక్ జోడీ

ప్రపంచానికే ఎన్నో అనుభవాలను నేర్పుతూ కష్ట సుఖాలంటే ఎలా ఉంటాయో తెలిపిన 2020కి నేటితో ముగింపు పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలకు వీడ్కోలు చెబుతూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు కానీ ఈ 2020కి వీడ్కోలు చెప్పడం ప్రత్యేకం అంటున్నారు జనం. ఇకపోతే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కోలా ప్లాన్ చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలంతా వారి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి 2021 సంవత్సరానికి వెల్కమ్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవాను వేదికగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు భర్త నాగ చైతన్యతో కలిసి గోవా పయనమైంది సామ్. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం చైసామ్ జోడీ కెమెరా కంటికి చిక్కింది. ఇద్దరూ ముఖానికి మాస్కులు ధరించి గోవా బయల్దేరారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ సమయం దొరికినప్పుడల్లా అలా అలా షికార్లు కొట్టే ఈ అక్కినేని జోడీ గోవాలోని ప్లష్‌ రిసార్ట్‌లో న్యూ ఇయర్‌ వేడుకలను ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటి నుంచి జనవరి మొదటి వారం ముగిసేవరకు ఈ ఇద్దరూ అక్కడే ఎంజాయ్ చేయనున్నారని తెలుస్తోంది. 2017 సంవత్సరంలో చైసామ్ గోవాలో ఒక్కటైన సంగతి తెలిసిందే. అందుకే వారిద్దరికీ గోవా ఎంతో ప్రత్యేకం. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవాలో సందడి చేయాలని ఫిక్స్ అయ్యారట అక్కినేని దంపతులు. సో.. చూస్తుంటే 2021 ఆరంభంలోనే ఈ జోడీ రొమాంటిక్ పిక్స్ మరోసారి సోషల్ మీడియాకు షేక్ చేయడం ఖాయమే అనిపిస్తోంది కదూ!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34X19kq

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk