Thursday, 31 December 2020

‘వకీల్ సాబ్’ స్టన్నింగ్ పోస్టర్.. సంక్రాంతికి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కొత్త ఏడాదిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి వచ్చేస్తున్నారు. మొదటిగా ‘వకీల్ సాబ్’తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల విరామం తరవాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘వకీల్ సాబ్’పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సిద్ధమవుతున్నాడు ‘వకీల్ సాబ్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచాయి. ఇప్పుడు మరో స్టన్నింగ్ పోస్టర్‌ను వదిలారు ‘వకీల్ సాబ్’. తెలుగు ఆడియన్స్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘వకీల్ సాబ్’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్, శ్రుతిహాసన్ జావా బైక్‌పై దూసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ లుక్ అదిరింది. ఆయన వెనుకాల శ్రుతిహాసన్ కూడా చిరునవ్వులు ఒళికిస్తున్నారు. అంతేకాదు, ఈ పోస్టర్‌తో మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. ఈ సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, హిందీ సూపర్ హిట్ ఫిలిం ‘పింక్’కు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. మూడు రోజుల క్రితమే షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. మామిడాల తిరుపతి మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రవి వర్మ యాక్షన్ డైరెక్టర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2L8cWoX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....