Saturday, 26 December 2020

మళ్లీ చర్చల్లో నిలిచిన రష్మిక లవ్ మ్యాటర్! ప్రియుడు రక్షిత్ శెట్టి కామెంట్‌‌తో ఇష్యూ వైరల్

'ఛలో' అంటూ తెలుగు తెరపై అడుగుపెట్టి అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది కన్నడ బ్యూటీ . మొదటగా తన మాతృభాష అయిన కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ'తోనే సినీ గడప తొక్కిన ఈ అమ్మడికి టాలీవుడ్ ఇండీస్ట్రీ బాగా కలిసొచ్చింది. ఇక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని హిట్‌గా మలచుకుంటూ స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఇదిలా ఉంటే ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఓ చేదు ఘటన అలాగే మిగిలి ఉంది. నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించిన ఆమె మధ్యలోనే బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రష్మికపై రక్షిత్ చేసిన కామెంట్‌తో మరోసారి ఈ జోడీ లవ్ మ్యాటర్ వార్తల్లో నిలిచింది. రష్మిక తన తొలి సినిమా 'కిరిక్ పార్టీ'లో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత అతనితో కొంతకాలం ప్రేమాయణం సాగించి పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయింది. వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరగడంతో త్వరలో పెళ్లి జరుగుతుందని అంతా ఫిక్సయ్యారు. ఇంతలో ఊహించని విధంగా ఆతనితో బ్రేకప్ చెప్పేసి దూరంగా ఉంటోంది రష్మిక మందన. ఈ క్రమంలో తాజాగా రష్మిక చేసిన ఓ ట్వీట్‌పై రియాక్షన్ చూసి జనాల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. రష్మిక మొదటి చిత్రం 'కిరిక్ పార్టీ' లోని ''బెల‌గెద్దు యారా మ‌గువా'' అనే పాటకు యూట్యూబ్‌లో 100 మిలియ‌న్ల వ్యూస్ వచ్చాయి. ఆ సాంగ్ మేకింగ్ నాకింకా గుర్తుంది.. ఆ ఙ్ఞాప‌కాల్లోనే ఉన్నా. నాలో ఉన్న శాన్వీని గుర్తిస్తున్నా అంటూ ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాదు ఈ ట్వీట్‌కి తన మాజీ ప్రియుడు, ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టిని కూడా ట్యాగ్ చేసింది. ఇక ఇది చూసిన రక్షిత్.. ''గో.. గో.. అండ్ గో గ‌ర్ల్. నీ క‌ల‌ల‌న్నీ నెర‌వేరాల‌ని కోరుకుంటున్నా'' అని కామెంట్ చేశాడు. దీంతో మరోసారి ఈ ఇద్దరి ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aHhKMH

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk