Tuesday, 29 December 2020

పోలీసులపై గౌరవం చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ పనికి అందరూ ఫిదా

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి పోలీస్‌ శాఖ అంటే అపారమైన గౌరవం. ఆ విషయాన్ని ఆయన బహిరంగ వేదికలపైనే ఎప్పుడూ చెబుతుంటారు. ఆ గౌరవాన్ని ఆయన మరోసారి చాటుకుని అందరినీ ఫిదా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ సందర్భంగా యాక్షన్‌ సన్నివేశాలు షూట్ చేశారు. దీనిలో భాగంగా పోలీసులకీ, విద్యార్థులకీ మధ్య ఘర్షణ సన్నివేశాల్ని తెరకెక్కించారు. Also Read: ఈ సందర్భంగా పోలీసులు అల్లర్ల సమయంలో రక్షణగా అడ్డు పెట్టుకునే కవచాల్ని వినియోగించారు. వాటిపై పోలీస్‌ అని రాసి ఉంది. విద్యార్థులు పోలీసులపై దాడి చేసే సన్నివేశంలో ఆ కవచాలను కొట్టాల్సి ఉంది. అయితే పోలీస్ అనే పేరుపై కొట్టడం ఇష్టం లేక పవన్ వాటిపై ఉన్న స్టిక్కర్లను స్వయంగా తొలగించారు. ఆ సమయంలో యూనిట్ సభ్యులు తీసిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన వాళ్లు పవన్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అంటూ పొగిడేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3o2WcOc

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...