Thursday, 31 December 2020

రవితేజ ‘క్రాక్’ ట్రైలర్: ష్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చపేలిపోద్ది!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ‘క్రాక్’ అంటూ తన రేంజ్ ఏంటో చూపించబోతున్నారు. ఆ రేంజ్ ఎలా ఉండబోతోందో మచ్చుకు ‘క్రాక్’ ట్రైలర్ ద్వారా ఈరోజు చూపించారు. అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘క్రాక్’ ట్రైలర్ వచ్చేసింది. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా జనవరి 1న ‘క్రాక్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా ఉంది ట్రైలర్. ‘‘చూశారా జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయి. ఇక్కడ కామ్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు’’ అంటూ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలైంది. ‘‘శంకర్.. పోతరాజు వీర శంకర్’’ అని మీసం దువ్వుతూ రవితేజ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి దరువు మొదలైంది. యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్, రొమాన్స్ అన్నీ ఒకే ట్రైలర్‌లో చూపించేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ ట్రైలర్‌లో మరో హైలైట్ సాయిమాధవ్ బుర్రా డైలాగులు. ప్రతి డైలాగ్ వహ్వా అనిపించేలా ఉంది. ‘‘ఒంగోలు నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా’’ అంటూ విలన్ సముద్రఖనితో రవితేజ చెప్పే డైలాగ్ మాస్ మహారాజా ఫ్యాన్స్‌తో ఈలలు వేయిస్తుంది. ఇక తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుమ్మిపడేశారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూడో సినిమాకు ఎస్. త‌మ‌న్ సంగీతం సమకూరుస్తుండగా జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్రసాద్‌, చిర‌గ్ జాని, మౌర్యని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి తదితరులు నటించారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n1PwyB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....