Sunday, 27 December 2020

Solo Brathuke So Better: రెండు రోజుల కలెక్షన్ రిపోర్ట్.. థియేటర్లలో మెగా మేనల్లుడి హవా

ఇన్నాళ్లు గేట్లకు తాళం వేసి ఆడియన్స్ లేక వెలవెలబోయిన సినిమా థియేటర్స్‌‌లోకి ధైర్యంగా ఎంటరై నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన '' తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. తొలి రోజున 4.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజూ అదే హవా కనబర్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలిరోజే మంచి టాక్ తెచ్చుకోవడంతో మెగా అభిమానులు ఖుషీ అయ్యారు. అదే జోష్ రెండో రోజు కూడా కనిపించడంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో మరో హిట్ పడినట్టే అని చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. రెండో రోజు 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీ 3.29 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా చూస్తే ఈ రెండు రోజుల్లో వసూళ్లు 7.99 కోట్లుగా నమోదయ్యాయి. ఇక రెండో రోజు వసూళ్లను ఏరియా వారిగా చూసినట్లయితే.. నైజాం - 1.19 కోట్లు సీడెడ్ - 59 లక్షలు గుంటూరు - 26 లక్షలు నెల్లూరు - 13 లక్షలు కృష్ణా - 18 లక్షలు వెస్ట్ గోదావరి - 15 లక్షలు ఈస్ట్ గోదావరి - 24 లక్షలు వైజాగ్ - 55 లక్షలు. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా 50 శాతం అక్యుపెన్సీతో ప్రదర్శించబడుతున్న ఈ మూవీకి భారీ రెస్పాన్స్ రావడంతో టాలీవుడ్ అంతా ఖుషీ అవుతోంది. థియేటర్స్‌లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారని తెలిసి దార్శనిర్మాతల్లో ఆశలు చిగురించాయి. ఇక ఇప్పటికే విడుదలకు సిద్దమైన సినిమాలను 2021లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KBbV8I

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....