Sunday, 27 December 2020

సంక్రాంతి రేసులో బెల్లంకొండ శ్రీనివాస్.. డేట్ ఫిక్స్ చేసిన ‘అల్లుడు’

యంగ్ హీరో సంక్రాంతి రేసులో నిలబడ్డారు. ఆయన హీరోగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో శ్రీనివాస్ డీసెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. గతేడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూప‌ర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీ‌నివాస్.. ఇప్పుడు వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘అల్లు అదుర్స్’ చిత్రాన్ని సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభనకు ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సెప్టెంబర్‌ ఆఖరి వారంలో ‘అల్లు అదుర్స్’ చిత్రీకరణ హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. రామోజీ ఫిలిం సిటీలో చివరి షెడ్యూల్ జరుపుతున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్‌కు జంటగా న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్, సోనూ సూద్‌, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీ‌నివాస్‌రెడ్డి, స‌త్య, కాదంబ‌రి కిర‌ణ్‌, చ‌మ్మక్ చంద్ర, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రుల‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. పండ‌గ సీజ‌న్లలో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టప‌డ‌తారని.. ఈ సంక్రాంతికి ‘ల్లుడు అదుర్స్’ చిత్రం ప్రేక్షకులకు స‌రైన చాయిస్ అని చిత్ర బృందం అంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WMi1Wz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....