
'సైరా నరసింహా రెడ్డి' తర్వాత మెగాస్టార్ చేస్తున్న తాజా సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. మణిశర్మ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా సెట్స్‌పై రామ్ చరణ్, కొరటాల శివ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాత రామ్ చరణ్ టీ తాగుతూ హుషారుగా కనిపిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ వేసిన సెట్‌లో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సురేశ్ క్రియేట్ చేసిన సెట్ ఎంతో బాగుందని రామ్ చరణ్ మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆనందంతో రామ్ చరణ్‌తో దిగిన పిక్స్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్. Also Read: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ రోల్ దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉంటుందని, నక్సలైట్‌గా ఆయన ఓ విలక్షణమైన పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఫొటోలు చూసి ఆ పాత్రలో నటించేందుకు చెర్రీ సెట్స్ పైకి చేరుకున్నారా? లేక ఆచార్య షూటింగ్ పర్యవేక్షణ కోసం అక్కడికి వచ్చారా? అని చర్చించుకుంటున్నారు జనం. ఇక ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ కూడా ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WNfPOr
No comments:
Post a Comment