‘అన్నాత్తై’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురైన సూపర్‌స్టార్ క్రమంలో కోలుకుంటున్నారు. అపోలో ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జి అయిన నేరుగా చెన్నైలోని ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఆయనతో మాట్లాడారు. రాజకీయాలు, పార్టీ పనులు అంటూ నిత్యం అదే ఆలోచనతో ఉండటం వల్లే మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు రజినీని కోరినట్లు తెలుస్తోంది. Also Read: ‘రాజకీయాలు మనకొద్దు పప్పా.. ఇక ఆ పనులు మానుకోండి’ అని ఇద్దరు కుమార్తెలు రజినీని వేడుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ ప్రకటిస్తానని రజినీకాంత్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ జెండా, చిహ్నం గురించి అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే రజినీకాంత్ అనారోగ్యానికి గురికావడంతో పార్టీ ప్రకటన ఉంటుందా?.. వాయిదా పడుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. దీనిపై రజినీ మక్కల్ మండ్రం నిర్వాహకుడు తమిళరువి మణియన్ మాట్లాడుతూ.. పార్టీ స్థాపన కార్యక్రమాలు యథావిథిగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రజినీకాంత్ సభలకు ప్రత్యక్షంగా హాజరు కానున్నా.. పార్టీ తరఫున ప్రకటనలు విడుదల చేస్తే చాలని, మిగిలినదంతా తామే చూసుకుంటామని చెబుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hpRfMT
No comments:
Post a Comment