Sunday, 27 December 2020

K.G.F Chapter 2 లో నందమూరి బాలకృష్ణ.. బాబోయ్ ఇక పూనకాలే..!!

కేజీఎఫ్- 2లో నటిస్తున్నారట. అరె! నిజామా..? అని ఆశ్చర్య పోతున్నారు కదూ. చిత్రయూనిట్ అయితే ఇప్పటిదాకా ఈ మాట చెప్పకుండా సస్పెన్స్ పెట్టిందేమో గానీ గూగూల్ మాత్రం ఆ విషయాన్ని పసిగట్టేసింది. అదేనండీ.. ఈ రోజుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ తల్లినే అడుగుతున్నాంగా. అలాగే కాస్ట్ ఎవరని గూగూల్‌లో సెర్చ్ చేస్తే అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారని చూపెడుతోంది. ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు. నిజమా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్‌కి ఇక పూనకాలు ఖాయమే. కన్నడ స్టార్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్‌ ఛాప్టర్‌-1కి సీక్వల్‌గా ఈ కేజీఎఫ్ చాప్టర్- 2 రూపొందుతోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ రవీనా టండన్‌ కీలకపాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇటీవలే హైదరాబాద్‌ షెడ్యూల్ పూర్తిచేసిన యూనిట్.. రాఖీ భాయ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8 ఉదయం 10.18 గంటలకు కేజీఎఫ్ చాప్టర్- 2 టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు మేకర్స్. సో.. చూడాలి మరి గూగుల్ చెప్పినట్లుగా ఈ టీజర్‌లో బాలకృష్ణను చూపించి సర్‌ప్రైజ్ చేస్తారా? లేక గూగుల్ తప్పుగా చూపించిందని కన్ఫర్మ్ చేస్తారా అనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34LkW6f

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....