Sunday, 27 December 2020

హీరోగా మారుతున్న జానీ మాస్టర్.. పవన్‌తో ప్రాజెక్ట్ సంగతేంటో!

టాలీవుడ్‌లో కొరియాగ్రాఫర్‌గా కొనసాగుతున్న హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా?.. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌‌ కోసం ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేశానని, ఎప్పటికైనా ఆయన్ని డైరెక్ట్ చేస్తానని గతంలో జానీ మాస్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రామ్‌చరణ్ నిర్మాతగా, పవన్‌తో ఆయన ఓ సినిమా చేయనున్నారని, మరోవైపు బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్‌ని డైరెక్ట్ చేయనున్నారని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్లకు చెక్ పెడుతూ ఇప్పుడు ఆయనే హీరోగా మారుతుండటం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. Also Read: సుజీ విజువల్స్‌ బ్యానర్‌పై కె.వెంకట్‌ రమణ నిర్మాతగా మురళీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో జానీ మాస్టర్ హీరోగా నటించనున్నారు. ఈరోజు (డిసెంబర్ 28) హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను యూనిట్ నేడు ప్రకటించనుంది. ఇప్పటివరకు కొరియాగ్రాఫర్‌గా హీరోలతో స్టెప్పులు వేయించిన జానీ మాస్టర్ హీరోగా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hlLNL7

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...