Tuesday 1 December 2020

హైదరాబాద్ హాస్టల్‌లో వార్డెన్ వికృతం... చీడపురుగులంటూ చిన్మయి ఫైర్

సమాజంలో మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హాస్టళ్లల్లో ఉండే అమ్మాయిలపై వార్డెన్లు పాల్పడే అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల గుజరాత్‌లోని ఓ హాస్టల్ వార్డెన్ అమ్మాయిల పట్ల వికృత చర్యలకు పాల్పడిన ఘటన మరువక ముందే హైదరాబాద్‌లోనూ అలాంటి ఘటనే జరిగిందంటూ సింగర్ చిన్మయ్ బయటపెట్టింది. మీటూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్‌మీడియా ద్వారా బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ వార్డెన్ పైశాచికత్వంపై బాధితురాలి స్పందనను ట్విటర్‌ ద్వారా చిన్మయి తెలియజేశారు. బాధితురాలి కథనం ప్రకారం ‘నేను 2015లో పదో తరగతి చదివేదాన్ని. హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో చదువుకుంటూ అక్కడే హాస్టల్‌లో ఉండేదాన్ని. అక్కడ వార్డెన్ అమ్మాయిలను చాలా ఇబ్బందులు పెట్టేది. పీరియడ్స్ వచ్చాయని చెబితే వెంటనే నమ్మేది కాదు. బట్టలు విప్పి చూపించమనేది. అలాంటి పరిస్థితి నాకూ ఓ రోజు వచ్చింది. క్లాసులో ఉండగా నాకు పీరియడ్స్ వచ్చాయి. దీంతో టీచర్ పర్మిషన్ తీసుకుని హాస్టల్‌కి వెళ్లగా వార్డెన్ లోనికి అనుమతించలేదు. స్కూల్ టైమ్‌లో ఇక్కడికెందుకు వచ్చావంటూ తిట్టింది. పీరియడ్స్ వచ్చాయని చెప్పగా నమ్మలేదు. బట్టలు విప్పి చూపించమనడంతో అలాగే చేశాను. ఆ తర్వాతే నన్ను హాస్టల్‌లోకి అనుమతించింది. ఆనాటి ఘటన తలుచుకుంటే ఇప్పటికీ నాకు బాధేస్తుంటుంది’ అని చెప్పుకొచ్చింది. Also Read: ఈ కథనాన్ని యథాతథంగా తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన చిన్మయి మన సమాజంలో ఇలాంటి చీడ పరుగులు చాలామంది ఉన్నారంటూ ఘాటుగా విమర్శించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33zSGmx

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...