Tuesday 1 December 2020

స్పెషల్ డైట్‌లో పవన్.. ‘వకీల్ సాబ్’ కోసమేనట

పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న ‘’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం కోర్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఒక్కటే మిగిలి ఉంది. అయితే ఆ సన్నివేశాల కోసం పవన్ కాస్త సన్నబడాల్సి ఉందట. దీంతో పవన్ ఇప్పుడ బరువు తగ్గే పనిలో పడినట్లు టాక్. దీని కోసం లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఘన పదార్థాలు మానేసి పూర్తిగా ద్రవ పదార్థాలతో కూడిన ఆహారాన్నే తీసుకుంటున్నారట. ఈ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబర్ మూడో వారం నుంచి ప్రారంభం కానుంది. అప్పటిలోగా వీలైనంత సన్నబడాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారట. హిందీ సూపర్‌హిట్ అయిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, నివేదా థామస్‌ హీరోయిన్లుగా, శ్రుతిహాసన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oiOb7t

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...