Friday, 25 December 2020

రూటు మార్చిన రాశీఖన్నా.. సమంత, తమన్నా బాటలోనే..

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీలకు ఆదరణ లభిస్తుండంతో సినీనటులు కూడా ఆ వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా హీరోల కంటే హీరోయిన్లే వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సమంత, తమన్నా, సాయిపల్లవి... వంటి కథానాయికలంతా ఇప్పటికే ఈ అవకాశాలు అందిపుచ్చుకోగా.. ఈ జాబితాలోకి చేరింది. బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌తో కలిసి రాశీ ఖన్నా ఓ వెబ్‌సిరీస్‌లో సందడి చేయనుంది. Also Read: రాజ్‌-డి.కె దర్శక ద్వయం యాక్షన్‌ థ్రిల్లర్‌‌ కూడిన కథతో వెబ్‌సిరీస్‌ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే జనవరిలోనే షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. షాహిద్‌ కపూర్‌తో పాటు కోలీవుడ్‌కి చెందిన విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి కూడా ఇందులో నటిస్తున్నట్లు సమాచారం. రాజ్‌-డి.కె రూపొందిస్తున్న ‘ది ఫ్యామిలీ మేన్‌ 2’తోనే సమంత కూడా వెబ్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకెంత మంది తారలు ఈ వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడతారో చూడాలి మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34N0bHk

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....