Thursday, 24 December 2020

‘అన్నాత్తై’ షూటింగులో కరోనా కలకలం.. క్వారంటైన్లో రజినీకాంత్

సూపర్‌స్టార్ హీరోగా తెరకెక్కుతున్న ‘’ సినిమాను కరోనా వైరస్ కలవరపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్‌లో ఏకంగా నలుగురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రకటించిది. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్. యూనిట్ సభ్యులకు సాధారణ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ అని తేలిందని, అయితే రజినీకాంత్‌కు ఇతర సిబ్బందికి మాత్రం నెగిటివ్ వచ్చిందని సన్ పిక్సర్స్ తెలిపింది. అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు రజినీకాంత్ హైదరాబాద్‌లోనే క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ నెల 31 రజినీకాంత్ తన రాజకీయ పార్టీ ప్రకటిస్తారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. దీనిపై ఆయన సోదరుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీ ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 27 లేదా 28వ తేదీల్లో రజినీకాంత్ చెన్నై తిరిగి వస్తారని, 31న రాజకీయ పార్టీ ప్రకటించడం ఖాయమని స్పష్టం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38yvOoT

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....