Monday, 20 April 2020

రీల్ అండ్ రియల్ చంద్రబాబు.. మాజీ ముఖ్యమంత్రి బర్త్ డే ట్వీట్ వైరల్

నేడు (ఏప్రిల్ 20) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాయుడు పుట్టినరోజు. ఈ రోజుతో ఆయన 70వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో దగ్గుబాటి చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబు నాయుడుకు విషెస్ తెలిపిన రానా.. ఎన్టీఆర్ బయోపిక్‌లో తాను పోషించిన చంద్రబాబు పాత్ర లుక్, రియల్ చంద్రబాబు లుక్ పక్కపక్కనే పెట్టి ట్వీట్ చేశారు. ఈ మేరకు ‘‘హ్యాపీ బర్త్ డే సర్. మీ పాత్రను పోషించడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. తనదైన శైలిలో రానా చేసిన ఈ ట్వీట్ చూసి అటు తెలుగుదేశం కార్యకర్తలు, ఇటు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ‘చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘‘అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. మరోవైపు తమ ప్రియతమ నాయకుడు చంద్రబాబుకు టీడీపీ వర్గాలు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3atseM1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....