Monday, 27 April 2020

కాజల్ పాట అడుగుతున్న చిరు మనవరాలు.. ఉబ్బితబ్బిబ్బవుతున్న మెగాస్టార్

సోమవారం క్రియేట్ చేసిన సస్పెన్స్‌కు చెక్ పెట్టేశారు . నిన్న చిరు ట్విట్టర్ వేదికగా నిన్న ఆసక్తికర ట్వీట్ చేశారు. సాధారణంగా, నేను పాటలు షూటింగ్ చేసే సమయంలో వాటిని వింటూ పూర్తిగా ఆనందిస్తాను. కానీ ఇటీవల, ఓ పాటను మాత్రం తరచూ పాజ్‌ చేస్తూ.. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్‌ చేస్తున్నాను. దానికి గల కారణం ఏమిటన్నది రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. సరిగ్గా మంగళవారం తొమ్మిది గంటలకు ఆయన చెప్పిన విధంగా ఆ సస్పెన్స్‌కు తెర దించారు మెగాస్టార్. చిరు తరచూ వింటున్న పాట ఖైదీ నెంబర్ 150లోని మీమీ పాట. అయితే ఆయన ఎందుకు ఇదే పాటను పాజ్ చేస్తూ వింటున్నారో వీడియోతో సహా చూపించారు. తన మనవరాలిని ఒళ్లో కూర్చోపెట్టుకున్న చిరు, తనకు ఏ పాట కావాలని అడిగారు. దానికి ఆ చిన్నారి మీమీ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో చిరు ఎప్పుడూ అదే పాటేనా మరో పాట విందాం అన్నారు. దానికి బుంగమూతి పెట్టుకొని ఏడుపు ప్రారంభించేసింది. దీంతో వెంటనే ఆ చిట్టితల్లిని సముదాయించిన చిరంజీవి... టీవీలో మీమీ పాటను ఆన్ చేశారు. అంతే చిరు మనవారలు ఆనందంతో గంతులు వేయడం ప్రారంభించింది. చిన్నారి స్టెప్పులు చూసిన చిరు కూడా మనవరాలిని ఒళ్లో కూర్చుపెట్టుకునే స్పెప్పులు వేశారు అయితే పాటను మధ్యల పాజ్ చేసి మనవరాలు నవిష్కను ఆటపట్టించారు చిరు. ఇదంతా వీడియో తీసి తన అభిమానులకు షేర్ చేశారు. ఇప్పుడు మెగాస్టార్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SdDyW8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....