Sunday 26 April 2020

కమల్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడన్న నటి.. ఇది కుట్రేనన్న దర్శకుడు

ప్రముఖ మలయాళీ దర్శకుడు, కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ కమల్ తనను లైంగికంగా వేధించాడని మాలీవుడ్ వర్ధమాన నటి ఒకరు ఆరోపించినట్టు శనివారం ఒక మలయాళం టీవీ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. ‘ఆమి’ సినిమాలో నటించిన తనకు ‘ప్రణయమీనుకలుడే కాదల్’ చిత్రంలో లీడ్ రోల్ ఇస్తానని కమల్ ప్రామిస్ చేసినట్టు ఆ నటి ఆరోపించినట్టు వెల్లడించింది. ఇచ్చిన మాట ప్రకారం హీరోయిన్ పాత్ర ఇవ్వకపోగా తనను లైంగికంగా వేధించాడని ఆరోపించారని తెలిపింది. ఈ మేరకు కమల్‌కు నోటీస్ కూడా పంపిందని పేర్కొంది. ‘‘ఆయన దర్శకత్వం వహించిన ‘ఆమి’ సినిమా షూటింగ్ సమయంలో కూడా నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఆయన నన్ను ఫ్లాట్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆయనపై నాకున్న నమ్మకాన్ని కమల్ పోగొట్టుకున్నాడు. మేకతోలు ధరించిన తోడేలు అతను. ఆయన సొంత ఇంట్లో కూడా నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు’’ అని నోటీసులో నటి ఆరోపించినట్టు ఛానెల్ కథనంలో పేర్కొంది. మంజూ వారియర్ ప్రధాన పాత్రలో 2018లో ‘ఆమి’ సినిమా వచ్చింది. Also Read: ఇదిలా ఉంటే, తనపై వచ్చిన ఆరోపణలను దర్శకుడు కమల్ ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపడేశారు. ఏడాది క్రితం తనకు లీగల్ నోటీసు వచ్చిన మాట నిజమేనని అన్నారు. దానిపై తన అడ్వకేట్‌ను సంప్రదించగా, ఆ ఆరోపణల్లో నిజం లేదని ఆయన చెప్పారని.. దీంతో నోటీసు పంపినవారి నుంచి తదుపరి చర్యల కోసం వేచి చూడాల్సి వచ్చిందన్నారు. వారు తరవాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాను దాన్ని పక్కన పెట్టేశానని స్పష్టం చేశారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆయన మాట్లాడారు. కుట్రపూరితంగానే తనపై ఈ ఆరోపణలు చేశారని కమల్ అన్నారు. ‘‘చలనచిత్ర అకాడమీలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు దీని వెనుక ఉన్నారని నా అనుమానం. కొన్ని అంతర్గత విభేదాల కారణంగా ఆయన పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఏడాది క్రితం నాకు వచ్చిన లీగల్ నోటీసు గురించి కేవలం నా అడ్వకేట్‌కు, ఆ మాజీ ఉద్యోగికి మాత్రమే తెలుసు. కానీ, దీన్ని నిరూపించడానికి నా వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు’’ అని కమల్ వెల్లడించారు. అయితే, తనపై ఆరోపణలను ప్రసారం చేసిన ఛానెల్ సైతం తనపై మతం పేరుతో దాడి చేయడానికి ప్రయత్నించిందని తాను బలంగా నమ్ముతున్నట్టు కమల్ చెప్పారు. ‘‘ఆ ఛానెల్‌లో నా పేరును కమలుద్దీన్ మహమ్మద్ మజీద్ అని పలికారు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో నా పేరు కమలుద్దీన్ అని ఎవరికీ తెలీదు. అందరికీ కమల్ అనే తెలుసు. నేను తప్పుచేసుంటే నాపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఆ నటి కనీసం సోషల్ మీడియా పోస్ట్ అయినా ఎందుకు పెట్టలేదు? అసలు నా సినిమాలో నటీనటుల ఎంపిక కాస్టింగ్ టీమ్, నా అసోసియేట్స్ ద్వారా జరుగుతుంది’’ అని కమల్ వివరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SafhjD

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz