Monday, 27 April 2020

నందమూరి బాలకృష్ణతో రాజమౌళి మూవీ.. జక్కన్న రియాక్షన్ చూస్తే!!

నందమూరి నటసింహం బాలకృష్ణతో దర్శక ధీరుడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఇంకేముంది బాక్సాఫీస్ దడదడలాడాల్సిందే!. అయితే అలాంటి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై దృష్టి పెట్టారు తెలుగు ప్రేక్షకులు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ కావాలంటే బాలకృష్ణ- రాజమౌళి కాంబోలో సినిమా రావాల్సిందే అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై స్పందించిన రాజమౌళి.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న రాజమౌళి.. పలు మీడియా సంస్థలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు ఆసక్తి రేపే, ఆత్రుత కలిగించే ఎన్నో విషయాలను బయటపెడుతున్నారు. RRR తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించిన ఆయన, గతంలోనే బాలయ్యతో సినిమా చేయాలనుకున్నానని చెప్పారు. 17 ఏళ్ల కిందే ఆయనతో సినిమా చేయాలనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. స్టార్ హీరోలతో సినిమాలు చూసి తమ స్థాయిని పెంచుకోవాలనే కోరిక ప్రతి దర్శకుడికి ఉంటుందని, ఏదైనా కథ అనుకున్నప్పుడు ఫలానా హీరో అయితే సరిపోతాడని దర్శకులకు ముందే అనిపిస్తుందని జక్కన్న అన్నారు. అలానే నాకు అలా తనకు కూడా కొన్ని కథలు విన్నప్పుడు గారైతే బెటర్ అనే ఫీలింగ్ కలిగిందని రాజమౌళి చెప్పారు. బాలయ్యతో సినిమా చేయాలని తాను భావిస్తున్నప్పటికీ, ఇప్పట్లో అది కుదరకపోవచ్చని అన్నారు జక్కన్న. ఇక బాలయ్య సినిమాలంటే రాజమౌళికి మహా ఇష్టమని, బాలయ్య సినిమాను ఫస్ట్ డేనే థియేటర్‌కి వెళ్లి చూసేయడం ఆయనకు అలవాటనే సంగతి కొందరికే తెలిసిన వాస్తవం. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా RRR సినిమా చేస్తున్నారు రాజమౌళి. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకుంది. మరోవైపు బాలయ్య సైతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ మసాలా సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తదుపరి షెడ్యూల్స్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ySccOE

No comments:

Post a Comment

'Acting Is Such A Rich Man's Business Now'

'It's no more just art and skills, it's a business.' from rediff Top Interviews https://ift.tt/rQNK1fd