Thursday, 30 April 2020

Happy BirthDay Ajith: లాక్‌డౌన్‌లో అజిత్ పుట్టిన రోజు.. ఆయన కోరినట్లుగానే!

తమ ఫేవరెట్ హీరో పుట్టిన రోజు వచ్చిందంటే అభిమానులకు అదో పండగ రోజు. భారీ కటౌట్స్, కేక్స్ కట్ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. కానీ నేడు (మే 1) పుట్టినరోజున ఎలాంటి ఆడంబరాలు లేకుండానే ఆ కార్యక్రమం జరుగుతోంది. 1971 సంవత్సరం మే 1వ తేదీన తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్.. ఈ రోజు 49వ ఏట అడుగిడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరో బర్త్ డేని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు ఫ్యాన్స్. అయితే కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న ఈ టైమ్‌లో తన పుట్టినరోజు వేడుకలకు జరపకూడదని అజిత్ ఫ్యాన్స్‌కి తెలిపారు. దీంతో ఆయన కోరిక మేరకు ఎలాంటి ఆర్బాటం లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతోంది అభిమాన లోకం. మరోవైపు ఆయన నటిస్తున్న తాజా సినిమా 'వలిమై' నుంచి బర్త్ డే సర్‌ప్రైజ్ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహించదలచుకోలేదని ఆ మూవీ యూనిట్ పేర్కొంది. సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి అశేష పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన దక్షిణాదిలోని బిగ్గెస్ట్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతుండటం విశేషం. కేవలం పదో తరగతి వరకే చదువుకున్నప్పటికీ తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతో పాటు ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు సాధించారు అజిత్. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఆయన అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఒక బాబు ఓ పాప. బాబు పేరు ఆద్విక్ కుమార్ కాగా పాప పేరు అనుష్క. 1992లో ప్రేమపుస్తకం అనే తెలుగు సినిమాలో నటించి టాలెంటెడ్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న అజిత్.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో రాణించారు. మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నారు. ఇక ఆయనలో దాగిఉన్న మరో టాలెంట్ బైక్ రేసర్. అంతేకాదు దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకరుగా గుర్తింపు పొందారు హీరో అజిత్. ఇదొక్కటే కాదు ఆపత్కాలంలో సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకోవడంలోనూ ముందుంటారు అజిత్. తాజాగా నెలకొన్న కరోనా కల్లోల పరిస్థితుల్లో తన వంతుగా 1 కోటి 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ప్రధాన మంత్రి సహాయనిధికి 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు సంబంధించిన నిధికి 25 లక్షల రూపాయలు కేటాయించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు అజిత్. మల్టీటాలెంటెడ్ యాక్టర్ గానే గాక బెస్ట్ డ్రైవర్‌గా, మంచి భర్తగా, సమాజ హితం కోరే వ్యక్తిగా జీవన ప్రయాణం సాగిస్తున్న అజిత్‌కి మీ,మా తెలుగు సమయం తరఫున ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. హ్యాపీ బర్త్ డే అజిత్. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YiSgix

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk