Wednesday 29 April 2020

Rishi Kapoor Death: ట్రూ లెజెండ్.. రిషి కపూర్ మృతిపై చిరంజీవి, మోహన్ బాబు స్పందన

దివంగత దిగ్గజ నటుడు రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ (67) మరణం యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టేసింది. నిన్న (బుధవారం) బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం, ఆ వెంటనే నేడు (గురువారం) మరో నటుడు రిషి కపూర్ కన్నుమూయడం జీర్ణించుకోలేకపోతోంది సినీ లోకం. రిషి కపూర్ మరణవార్త తెలిసి మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా రియాక్ట్ అయ్యారు. ''రిషి కపూర్ మరణించారనే వార్త వినగానే గుండె పగిలింది. సినిమా ప్రపంచంలో మరో పూడ్చలేని నష్టం జరిగింది. ట్రూ లెజెండ్, అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రిషి కపూర్ మరణం కలచివేసింది. రణబీర్, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతూ రిషి కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని మహేష్ బాబు పేర్కొన్నారు. ''చిత్రసీమకు ఇది భయంకరమైన వారం. పూడ్చలేని నష్టం జరిగింది. లెజెండరీ రిషీ కపూర్, టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మరణాలు నష్టాన్ని మిగిల్చాయి. ఆ రెండు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. గొప్ప యాక్టర్, మంచి స్నేహితుడు రిషి కపూర్ ఇక లేరనే వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గొప్ప వారసత్వాన్ని మోస్తూ కొన్ని మిలియన్ల హృదయాలను కొల్లగొట్టిన రిషి.. అందరినీ బాధపెడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. నా గుండె పగిలింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. నా స్నేహితుడికి కన్నీటి వీడ్కోలు'' అని పేర్కొంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yX2SbY

No comments:

Post a Comment

'Trump Will Back India On Pakistan'

'Trump will absolutely back New Delhi on its position that Pakistan must do more to crack down on terrorists that threaten India.' ...