Monday, 27 April 2020

హ్యాపీ బర్త్ డే సమంత: అలాంటి అపోహలకు ఫుల్‌స్టాప్.. భార్య కోసం చైతూ!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా సత్తా చాటుతోంది . పెళ్ళికి ముందే హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అక్కినేని వారింట అడుగుపెట్టాక మరింత హవా కొనసాగిస్తోంది. హీరోయిన్ల పెళ్ళికి, కెరీర్‌కి ఎలాంటి సంబంధం లేదని నిరూపిస్తూ ప్రేక్షాధారణ పొందుతోంది. ఒకరకంగా చెప్పాలంటే పెళ్లి చేసుకున్నాకే ఆమె వరుస హిట్స్ అందుకుంది. పెళ్లయింది కదా అని గ్లామర్ ఒలకబోయడంలోనూ ఏ మాత్రం షరతులు పెట్టకపోవడం సమంతలో దాగిఉన్న వృత్తి ధర్మానికి నిదర్శనం. సరిగ్గా ఈ రోజే అనగా ఏప్రిల్ 28వ తేదీ 1987 సంవత్సరం జన్మించిన సమంత.. అశేష తెలుగు అభిమానుల గుండెల్లో స్థిరపడిపోయింది. 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై క్రమంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మొదటి సినిమా హీరో నాగచైతన్యతోనే ప్రేమలో పడ్డ ఆమె చాలాఏళ్లు ఆయనతో ప్రేమాయణం కొనసాగించి చివరకు అక్కినేని వారింట అడుగుపెట్టింది. దీంతో ఇక సమంత సినిమాలు చేయదని అనుకుంటున్న తరుణంలో అందరికీ షాకిస్తూ 'రంగస్థలం'లో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేసి భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత అన్నట్లుగా ఆమె కెరీర్ సాగిపోతోంది. పెళ్లి తర్వాత భర్త నాగ చైతన్యతో కూడా మరోసారి తెరపంచుకున్న సామ్ ‘మజిలీ’ రూపంలో మాయ చేసింది. ఇంటి ఇల్లాలుగా, చైతూ భార్యగా అబ్బురపరిచే అభినయం కనబర్చింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమా‌ ‘ఓ బేబి’ సినిమాతో తాను సోలోగా కూడా మెప్పించగలనని నిరూపించింది సమంత. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఆమె చివరగా శర్వానంద్‌‌తో కలిసి 'జాను' సినిమాలో కనిపించింది. యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కేవలం సినిమాలే కాదండోయ్.. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేయడంలోనూ సమంతను మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు తన హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ సెగలు రేపడమే కాదు, తన ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తూ అక్కినేని అభిమానులకు స్పెషల్ కిక్ ఇస్తుంటుంది సమంత. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్‌లు చేయాలనే వినూత్న ఆలోచన చేసిన సామ్.. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా నందినీ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనుందని తెలుస్తోంది. గ్లామర్ హీరోయిన్ గానే కాదు మంచి మనసున్న అమ్మాయిగా కూడా సమంత భేష్ అనిపించుకుంటోంది. సామాజిక కోణంలో ఆలోచించి సాటిమనిషికి సాయపడాలనే దృక్పథంతో ముందుకు సాగుతోంది ఈ ముద్దుగుమ్మ. 'ప్రత్యూష సపోర్ట్' అనే స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభించిన ఆమె.. బడుగు, బలహీల వర్గాల పిల్లలకు విద్య, వైద్యం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటోంది. ఇలాంటి టాలెంటెడ్ సమంత నేడు (ఏప్రిల్ 28) తన 33వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు భార్య సమంత కోసం సొంతంగా ఇంట్లోనే కేకు రెడీ చేసి ఆమెతో కట్ చేయించారు. ఈ పిక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన సమంత.. తాను దేని గురించి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానో గెస్ చేయలేరు అని పేర్కొంది. మొత్తానికైతే మోడ్రన్ కోడలిగా, స్టార్ హీరోయిన్‌గా సమంత కొనసాగిస్తున్న జోష్ హీరోయిన్లు పెళ్ళైతే నటనకు పనికిరారనే అపోహలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఏమంటారు మరి!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VHwSl3

No comments:

Post a Comment

'Difficult To Trust Yunus Govt In Dhaka'

'It was the hostility of the Yunus regime that made India careful and wary of dealing with them.' from rediff Top Interviews https...