Tuesday, 28 April 2020

సినిమాలు ఇవ్వకపోయినా పర్లేదు.. ఆ పని మాత్రం చేయనని వారికి చెప్పా: దిగంగన

ఇండస్ట్రీలో నటనతో దర్శక, నిర్మాతలకు ఆకట్టుకునే వారు కొందరైతే అందచందాలను పెట్టుబడిగా పెట్టి.. ఎంత ఆరబోస్తే అన్ని ఆఫర్స్ అన్నట్టుగా రెచ్చిపోతుంటారు. ఇలాంటి వాళ్లకు ఒకటి రెండు సినిమాలతోనే ఇంటికి పంపేస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. నటనలో ఉన్న అందాన్నే చూస్తారు తప్ప.. పైపై మెరుగుల్ని మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అయితే కొంతమందికి అందం, అభినయం రెండూ ఉన్నా లక్ కలిసిరాకపోవడంతో ఒకటి రెండు సినిమాలకే తెరమరుగుఅవుతున్నారు. హిప్పీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సూర్యవన్షీకి ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ఎంట్రీలోనే నిరాశకు గురైంది. ఆ సినిమాలో మితిమీరి అందాలు ప్రదర్శించి.. లిప్ లాక్‌లతో రెచ్చిపోయిన దిగంగన ఇకపై అలాంటి సీన్లు చేయనంటోంది. హీరోయిన్ క్వాలిటీస్ ఆమెలో పుష్కలంగా ఉండటంతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటానంటోంది. ఆమె మాట్లాడుతూ.. ‘హిప్పీ’ సినిమా సక్సెస్ కాలేకపోయినప్పటికీ నా వరకూ నేను హ్యాపీగానే ఉన్నాను. ఆ చిత్రంలో నా పాత్రకు మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అయితే దర్శకుడు తెరకెక్కించిన విధానం ఒక్కటైతే.. ప్రేక్షకుడు చూసే కోణం మరోలా ఉండటంతో సినిమా క్లిక్ కాలేదు. ఒక్కోసారి ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం దగ్గకపోవచ్చు. ఈ విషయంలో చాలా బాధపడ్డా. సినిమా హిట్ కావాలంటే మన పాత్ర ఒక్కటే కాదు మిగిలిన పాత్రలు కూడా బాగుండాలని తెలుసుకున్నా. అయితే హిప్పీ చిత్రం తరువాత నాకు మంచి అవకాశాలే వచ్చాయి. తమిళ్‌లో ఓ సినిమా చేశా. మళ్లీ తెలుగు చేయడానికి గ్యాప్ తీసుకున్నది మంచి పాత్ర కోసమే. హిప్పీలో గ్లామరస్ రోల్ కాబట్టి కథా బలం ఉన్న పాత్రను చేయాలని ‘వలయం’ సినిమాకి ఓకే చేశా. ఇందులో నా క్యారెక్టర్‌కి మంచి స్కోప్ ఉంటుంది. ఇక గోపీచంద్ సిటీమార్‌లో సెకండ్ హీరోయిన్‌గా మంచి పాత్ర వచ్చింది. ఇంతకు ముందు నా పాత్ర వరకే ఆలోచించేదాన్ని ఇప్పుడు సినిమా స్క్రిప్ట్‌‌ని తెలుసుకుంటున్నా. ఎందుకంటే నాకు స్క్రిప్ట్‌పై అవగాహన ఉంది.. నేను కూడా సినిమాలకు స్క్రిప్ట్ రాస్తుంటా.. రెండు స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. కథలు కూడా రాస్తుంటా. ఎక్స్ పోజింగ్ విషయంలో నా పరిధిలు నాకు ఉన్నాయి. ఆ విషయంలో కాంప్రమైజ్ కాను. గ్లామర్‌గా కనిపించడం కోసం మితిమీరి అందాలు ఆరబోసి ఎక్స్ పోజింగ్ చేయడానికి నేను వ్యతిరేకం. కథతో సంబంధం లేకుండా కేవలం ఆరబోతకే పరిమయ్యే పాత్రలు చేయను. నాకు అవి ఇష్టం ఉండదు. నాకు ఆఫర్స్ ఇవ్వకపోయినా పర్లేదు.. కేవలం ఎక్స్ పోజింగ్ చేయడం కోసమే సినిమాలు చేయను అని దర్శక, నిర్మాతలకు ముందే చెప్పేస్తా. ఈ విషయంలో కాంప్రమైజ్ కాను. అందంగా నటించడం అంటే ఇష్టం.. అందాలను ఆరబోయడానికి నేను సిద్ధంగా లేను’ అంటూ తేల్చేసింది హిప్పీ బ్యూటీ .


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cYc92p

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk