Wednesday, 29 April 2020

Allu Arjun: ‘పుష్ప’లో ఐటెం పుష్పం.. అ అంటే అమలాపురం రేంజ్‌లో అల్లాడిస్తోందట!

సుకుమార్ సినిమా అంటే మాస్ మసాలా ఐటం సాంగ్ మస్ట్. ఇక ఈయన క్రియేటివిటీకి దేవి శ్రీ ట్యూన్, బన్నీ డాన్స్ తోడు అయ్యిందంటే మాస్ ఆడియన్స్ థియేటర్స్‌లో చిందులేయాల్సింది. సుకుమార్ చిత్రాల్లో ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ మినహా మిగతా అన్ని చిత్రాల్లోనూ ఐటం సాంగ్ కంపల్సరీ. అ అంటే అమలాపురం (ఆర్య).., రింగ రింగా (ఆర్య 2).., అప్పూ.. అప్పూ బ్రేకప్పూ.. (కుమారి 21 F).., డియాలో.. డియాలా ( 100% లవ్).., లండన్ బాబూ.. లండన్ బాబూ (నేనొక్కడినే).., జిల్ జిల్ జిగేలు రాణి (రంగస్థలం)., లాంటి పాటలు సుక్కు సినిమాల్లో ఐటం బాంబ్‌లలా పేలాయి. మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టాయి. ఇప్పుడు ఇదే ఐటం బాణాన్ని తన అప్ కమింగ్ మూవీలోనూ ప్రయోగిస్తున్నారు సుకుమార్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌-సుక్కూ కాంబోలో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో అదిరిపోయే మాస్ మసాలా ఐటం సాంగ్‌కి దేవి శ్రీ ట్యూన్స్ కట్టడం మొదలుపెట్టేశారట. అయితే ‘పుష్ప’ పక్కన ఆడిపాడే ఆ ఐటెం పుష్పం కోసం వెతుకులాట మొదలుపెట్టారట సుక్కూ. సుకుమార్ ఐటమ్ సాంగ్ చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఐటం‌లోనే మంచి కంటెంట్‌ను మిక్స్ చేసి వదులుతుంటారు సుక్కూ. ఇందులో డాన్స్‌ స్కిల్స్‌తో పాటు పాపులర్ సెలబ్రిటీలనే ప్రయోగిస్తుంటారు. అయితే ‘పుష్ప’ సినిమాలో ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీలను రంగంలోకి దింపుతున్నారట సుకుమార్. ఆ మధ్య బాలీవుడ్ బ్యూటీ, భరత్ అనే నేను మూవీ హీరోయిన్ కియానా స్పెషల్ సాంగ్ చేయబోతుందని వార్తలు రాగా.. ఈ లిస్ట్‌లో మలైకా అరోరా, దిశా పటాని, జాక్విలిన్ వంటి టాప్ ఐటెం భామలు ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరు కన్ఫామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VKv4b2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....