కరోనా విలయతాండవాన్ని నివారించడానికై దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. నిబంధనలు కట్టుదిట్టం చేసి అన్నిరంగాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా లిక్కర్, వైన్ షాప్స్ విషయంలో చాలా కఠినమైన రూల్స్ పాస్ చేశారు. లాక్‌డౌన్ ముగించేవరకు మద్యం షాపులు తెరిచే ప్రసక్తే లేదని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ఇష్యూలోకి ఎంటరైన రామ్‌గోపాల్ వర్మ.. మందు షాపులు తెరవాలని కోరుతూ ఇన్‌డైరెక్ట్ ట్వీట్స్ చేశారు. మద్యం దొరకకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో పేర్కొంటూ మందు బాబులకు సపోర్ట్‌గా కామెంట్ చేశారు. మద్యం అందుబాటులో లేకపోతే బ్లాక్ మార్కెట్ పెరిగి ప్రజల ఆర్ధిక అవసరాలకు నష్టం చేకూరుతుందని వర్మ అభిప్రాయపడ్డారు. ''ప్రజలు కోరుకునే దాన్ని ఇలా పరిమితం చేయడం వల్ల బ్లాక్ మార్కెట్‌లో ధరలు పెంచి అమ్మే అవకాశం ఉంటుంది. దీనివల్ల తమకు అవసరమైన ఆల్కహాల్‌ను చాలా ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కారణంగా వారి కుటుంబాలు ఇతర అవసరాలను కోల్పోయే అవకాశం ఉంది'' అని వర్మ పేర్కొన్నారు. ఆల్కహాల్ దొరకకపోవడం కారణంగా కొందరిలో పెరిగిపోతున్న ఫ్రస్టేషన్ స్థాయి గురించి నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని వర్మ తెలపడం విశేషం. కరోనా వల్ల ఏర్పడిన ఈ పరిస్థితులు పరిపాలన విభాగాలపై కోపం తెప్పిస్తున్నాయని, అయినా ఆల్కహాల్‌కి కరోనాకు సంబంధం లేదని పేర్కొంటూ మందు బాబులకు సపోర్ట్ చేసే ట్వీట్స్ చేశారు వర్మ. ఏ విషయాన్నైనా ప్రత్యేక కోణంలో ఆలోచించే వర్మ.. లిక్కర్ దుకాణాల మూసివేతపై ఇలా కామెంట్స్ చేయడంతో ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. వర్మకు ట్వీట్‌పై రియాక్ట్ అవుతూ కరెక్ట్‌గా చెప్పారంటూ బదులిస్తున్నారు నెటిజన్లు. గత కొన్నిరోజుల క్రితమే తెలంగాణ సీఎం కేసీఆర్‌కి విస్కీ ఛాలెంజ్ విసిరిన ఆయన ఇప్పుడు మందు ప్రియులకు మద్దతు తెలిపి విస్కీ వీరుడని ప్రూవ్ చేసుకున్నారు. చూడాలి మరి వర్మ చేసిన ఈ ట్వీట్స్ ఏమైనా కొత్త మార్పులకు స్వీకారం చుడతాయా? అనేది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2W0FHWa
No comments:
Post a Comment